ETV Bharat / entertainment

ప్రశాంత్​ వర్మ, రణ్​వీర్ సింగ్​ సినిమా - ఆ రూమర్స్​లో నిజం లేదు - Ranveer Singh Prasanth Varma Movie - RANVEER SINGH PRASANTH VARMA MOVIE

Prasanth Varma Ranveer Singh Movie : హనుమాన్ ఫేమ్​ ప్రశాంత్ శర్మ - బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ సినిమా ఆగిపోయిందనే ప్రచారం సాగుతోంది. వీరిద్దరి మధ్య క్రియేటివ్ డిఫెరెన్సెస్​తో సినిమా ఆగిపోయిందని అంటున్నారు. తాజాగా దీనిపై క్లారిటీ వచ్చేసింది. పూర్తి వివరాలు స్టోరీలో.

Prasanth Varma Ranveer Singh
Prasanth Varma Ranveer Singh (GettyImages)
author img

By ETV Bharat Telugu Team

Published : May 21, 2024, 4:39 PM IST

Prasanth Varma Ranveer Singh Movie : అ!, కల్కి, జాంబిరెడ్డి వంటి చిత్రాలతో గుర్తింపు సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ ఈ ఏడాది హనుమాన్​ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్​లో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఇకపై తాను చేయబోయే సినిమాలన్నీ పీవీసీయూ (ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌)లో భాగంగానే ఉంటాయని కూడా క్లారిటీ ఇచ్చారు. రానున్న 20ఏళ్ల పాటు ఈ సినిమాటిక్ యూనివర్స్​ చుట్టూ సినిమాల్ని తెరకెక్కించాలనేది తన ప్రణాళిక అని కూడా చెప్పారు.

ఈ క్రమంలోనే ఆ మధ్య బాలీవుడ్ స్టార్ హీరో రణ్​వీర్ సింగ్​తో ప్రశాంత్ వర్మ ఓ సినిమా చేస్తున్నట్లు ప్రచారం సాగింది. హనుమాన్ జయంతికి పూజా కార్యక్రమాలతో లాంఛ్ కూడా అయిందని వార్తలు వచ్చాయి. కానీ ఏమైందో తెలీదు సడెన్​గా ఈ చిత్రం ఆగిపోయిందంటూ వార్తలు రావడం మళ్లీ మొదలయ్యాయి. హీరో దర్శకుడు మధ్య క్రియేటివ్ డిఫెరెన్సెస్​ వచ్చాయని, దీంతో ఎవరి దారి వారు చూసుకున్నారని అంతా అన్నారు.

అయితే తాజాగా దీనిపై ఓ క్లారిటీ వచ్చింది. ప్రశాంత్ వర్మ టీమ్​లోని ఓ మెంబర్ ప్రముఖ ఇంగ్లీష్ వెబ్​సైట్​కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ రూమర్స్​లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. "క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ప్రశాంత్ శర్మ, రణ్‌వీర్ సింగ్ ఎవరి దారి వాళ్లు చూసుకున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదు. హనుమాన్ జయంతి రోజే పూజా కార్యక్రమాలతో ఈ మూవీ షూటింగ్​ను హైదరాబాద్​లో మొదలుపెట్టారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా ప్రశాంత్ ఈ సినిమా షూటింగ్​ చేశారు. రణ్‌వీర్​పై ఇప్పటికే కొన్ని సీన్లు కూడా పూర్తి చేశారు. ఈ ప్రాజెక్ట్ గురించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్​మెంట్​ ఇవ్వనున్నారు. అని సదరు మెంబర్ స్పష్టత ఇచ్చారు.

కాగా, రణ్‌వీర్ సింగ్ - ప్రశాంత్ వర్మ చేయబోయే సినిమా టైటిల్​ 'రాక్షస్' అని అంటున్నారు. హనుమాన్ సినిమా వర్క్​ మెచ్చి ప్రశాంత్​కు రణ్​వీర్ ఛాన్స్ ఇచ్చారట. ఇది కూడా ప్రశాంత్​ సినిమాటిక్ యూనివర్స్​లో భాగంగానే రాబోతుంది. మైథలాజికల్ బ్యాక్‌గ్రౌండ్​లో స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన కథగా రానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే రణ్​వీర్​ ప్రస్తుతం ప్రెగ్నెంట్​గా ఉన్న తన భార్య దీపికా పదుకొణెతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారని తెలిసింది. భవిష్యత్​లో ఆయన నుంచి డాన్ 2, శక్తిమాన్ లాంటి సినిమాలు కూడా రానున్నాయి.

'హరోం హర' రిలీజ్ పోస్ట్​పోన్​ - సుధీర్​కు కలిసొచ్చే నెలలో రిలీజ్ - Harom Hara Movie Release Date

సినిమాకు తగ్గట్లుగానే ప్రచారం - 'కల్కి 2898 AD' ప్రమోషనల్ బడ్జెట్ ఎంతంటే? - Prabhas Kalki 2898 AD

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.