ETV Bharat / entertainment

'రామాయణ'లో రణ్​బీర్​ ద్విపాత్రాభినయం - ఆ పాత్రకు అమితాబ్​ వాయిస్ ఓవర్​! - Ramayan Ranbir Kapoor - RAMAYAN RANBIR KAPOOR

Ramayan Ranbir Kapoor : బాలీవుడ్​లో తెరకెక్కుతోన్న అతిపెద్ద ప్రాజెక్ట్​ 'రామాయణ' గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. పూర్తి వివరాలు స్టోరీలో.

source ANI
Ranbir Kapoor Amitabh bachchan (source ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2024, 10:37 PM IST

Ramayan Ranbir Kapoor Dual Role : బాలీవుడ్​లో తెరకెక్కుతోన్న అతిపెద్ద ప్రాజెక్ట్​ 'రామాయణ'​. ఎలాంటి అధికారిక లాంఛ్ లేకుండా షూటింగ్​ను గుట్టుచప్పుడు కాకుండా శరవేగంగా చేసుకుంటూ పోతోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో ఇది ముస్తాబవుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఎన్నో విశేషాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. సీతారాములుగా రణ్​బీర్​, సాయి పల్లవి లుక్స్​ కూడా వైరల్ అయ్యాయి. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ రామాయణలో ఊహించని ఎన్నో ఆకర్షణలు ఉన్నాయట.

అందరూ అనుకున్నట్టుగా ఈ రామాయణలో రణ్​బీర్​ కపూర్ కేవలం రాముడి వేషంలోనే కాకుండా పరశురాముడిగానూ కనిపించబోతున్నారని తెలిసింది. రెండు లుక్స్​ మధ్య అస్సలు గుర్తుపట్టలేనంత వ్యత్యాసం చూపించబోతున్నారని టాక్​. పైగా రెండు శ్రీవిష్ణు అంశ ఉన్న అవతరాలే కనుక దానికి అనుగుణంగా రణ్​బీర్​తో ద్విపాత్రాభినయం చేయిస్తున్నారని సమాచారం.

ఇక రావణుడు ఎత్తుకెళ్ళేటప్పుడు, సీత మాతాను కాపాడేందుకు ప్రయత్నించి తనువు చాలించే జటాయువు పక్షికి బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్​ చెప్పబోతున్నారని తెలిసింది. తొలి భాగంలో రామసీత వివాహం, పద్నాలుగేళ్లు వనవాసం, చివర్లో రావణుడి ఎంట్రీతో శుభం కార్డు వేస్తారట. రెండో భాగంలో రావణుడిగా యశ్​ విశ్వరూపం ఉంటుందని సమాచారం.

Ranbir Kapoor Ramayan Cast : ఇకపోతే హనుమంతుడి పాత్రలో సన్నీ దేవోల్‌, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కనిపించనున్నారట. వీఎఫ్ఎక్స్‌ వర్క్​ను ఆస్కార్‌ విన్నింగ్‌ కంపెనీ డీఎన్‌ఈజీ చేయబోతున్నట్లు ఆ మధ్య ప్రచారం సాగింది. రామాయణాన్ని ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద ఎవరూ చూపించినంత గొప్పగా చూపిస్తానని అంటున్నారు నితేశ్ తివారి. సినిమా తెలుగు వెర్షన్‌ సంభాషణలు రాసే బాధ్యతను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు అప్పగించినట్లు కూడా ఆ మధ్య వార్తలు వచ్చాయి మొదటి భాగాన్ని 2026లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. మొత్తం మూడు భాగాలుగా సినిమా రానుందట.

'మేనన్‌' నా ఇంటి పేరు కాదు' - అసలు విషయం చెప్పిన నిత్యా మేనన్ - Nithya Menen About Her Name

హీరోయిన్​ రష్మికకు ప్రమాదం! - ఇప్పుడెలా ఉందంటే? - Heroine Rashmika Mandanna Injured

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.