ETV Bharat / entertainment

'RC 16 జానర్ ఇదే - నాకు ఆ హీరోహీరోయిన్ అంటే చాలా ఇష్టం' : రామ్ చరణ్ - Ramcharan Favourite Hero Heroine - RAMCHARAN FAVOURITE HERO HEROINE

Ramcharan RC 16 Update : మెగా పవర్ స్టార్​ రామ్‌ చరణ్‌ తాజాగా బుచ్చిబాబుతో చేయనున్న #RC16 సినిమా జానర్​ గురించి చెప్పారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ర్యాపిడ్‌ ఫైర్‌లో భాగంగా ఈ విషయాన్ని చెప్పారు. ఇంకా తనకు ఇష్టమైన సినిమా ఏంటి? హీరో ఎవరు? హీరోయిన్ ఎవరు? అనే విషయాలను చెప్పుకొచ్చారు.

source ETV Bharat
Ramcharan RC 16 (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 23, 2024, 8:17 AM IST

Ramcharan RC 16 Update : మెగా పవర్ స్టార్​ రామ్‌ చరణ్‌ తాజాగా బుచ్చిబాబుతో చేయనున్న #RC16 సినిమా జానర్​ గురించి చెప్పారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ర్యాపిడ్‌ ఫైర్‌లో భాగంగా ఈ విషయాన్ని చెప్పారు. ఇంకా తనకు ఇష్టమైన సినిమా ఏంటి? హీరో ఎవరు? హీరోయిన్ ఎవరు? అనే విషయాలను చెప్పుకొచ్చారు.

"నాకు ఆరెంజ్‌, రంగస్థలం సినిమాలు అంటే చాలా ఇష్టం. ఇక మగధీర నా ల్యాండ్‌ మార్క్‌ చిత్రం. చాలా మంది ఫ్యాన్స్​కు కూడా ఈ సినిమా అంటేనే ఇష్టం. అందుకే నేను కూడా ఈ మూవీ పేరే చెబుతాను. అయితే నాకు యాక్షన్‌ చిత్రాలంటే బాగా ఇష్టం." అని చరణ్ అన్నారు.

Ramcharan Favourite Hero, Heroine : 'థ్రిల్లర్‌, కామెడీ, ఏ జానర్‌ సినిమాలు చేస్తారు?' అని అడగగా - "కామెడీ ఎప్పుడూ చేయలేదు కానీ, అయితే బుచ్చిబాబుతో చేయబోయే సినిమా ఈ జానర్‌లోనే ఉంటుంది." అని చెప్పుకొచ్చారు. అలానే తనకు ఇష్టమైన హీరో కోలీవుడ్‌ స్టార్‌ సూర్య అని, ఈ తరం హీరోయిన్స్‌లో సమంత అంటే ఇష్టమని తెలిపారు.

'పుస్తకాలా, ఆటలా ' అని మరో ప్రశ్న అడగగా "Who Moved My Cheese పుస్తకం బాగుంటుంది. పుస్తకాలంటే ఇష్టం" అని అన్నారు. ఇంకా సంప్రదాయ దుస్తులంటే ఇష్టమని, ఇతరులకు తానెప్పుడు సూక్తులు చెప్పనని పేర్కొన్నారు.

'మీ లైఫ్లో మర్చిపోలేని ఫ్యాన్‌ మూమెంట్ ఏంట'ని అడగగా - "ఇక్కడ(ఇండియాలో) నాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే RRR ప్రమోషన్స్​లో భాగంగా జపాన్‌ వెళ్లగా అక్కడ 70 ఏళ్ల మహిళ నాకు ఓ పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చింది. 180 పేజీల పుస్తకం అది. అందులో నేను ఇప్పటి వరకు నటించిన సినిమాల్లోని పాత్రలు, చిత్రాలు ఉన్నాయి. వాటిని ఆమెనే స్వయంగా గీసినట్లు చెప్పింది. వాటిని చూసి ఆశ్చర్యపోయాను. ఆమెకు మన భాష తెలీదు. కానీ, అభిమానంతో నా సినిమాలు చూసి ఈ బొమ్మలు గీసినట్లు చెప్పింది. ఇది ఎప్పటికీ నాకు గుర్తుండిపోతుంది." అని అన్నారు.

కాగా, RC16 విషయానికొస్తే ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. ఏఆర్‌ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. జాన్వీ కపూర్‌ హీరోయిన్. ప్రస్తుతం చరణ్ గేమ్‌ ఛేంజర్‌ సినిమాను చేశారు. ఈ పొలిటికల్‌ యాక్షన్ థ్రిల్లర్‌ డిసెంబర్​లో వచ్చే అవకాశముంది.

రజనీకాంత్ జోరు - యంగ్​ డైరెక్టర్​తో మరో కొత్త సినిమాకు గ్రీన్​సిగ్నల్​! - Rajinikanth New Movie

రేసింగ్ టీమ్​ను కొనుగోలు చేసిన నాగ చైతన్య - గంగూలీతో పోటీ! - Naga Chaitanya Indian Racing League

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.