Shiva Rajkumar Health Condition : కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆ మధ్య ప్రచారం సాగింది. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు శివరాజ్ కుమార్. ప్రస్తుతం తాను చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. కాగా, తన కొత్త చిత్రం భైరతి రంగల్ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు శివ రాజ్ కుమార్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబరు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన అనారోగ్య సమస్య గురించి చెప్పారు. శస్త్రచికిత్స నిమిత్తం అమెరికా వెళ్లనున్నట్లు పేర్కొన్నారు.
శివ రాజ్‌కుమార్ మాట్లాడుతూ, "నా ఆరోగ్య సమస్య గురించి మొదటి సారి తెలిసినప్పుడు చాలా భయపడ్డా. నా ఫ్యాన్స్, ప్రజలు ఆందోళన పడటం నాకు ఇష్టం లేదు. కానీ దాన్ని ధైర్యంగా ఎదుర్కొనేలా నేను ఆత్మ విశ్వాసాన్ని పొందాను. ఇప్పుడు నాకు బాగానే ఉంది. ఫ్యాన్స్ ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. నేను అబద్ధం చెప్పను. నేను కూడా మనిషినే కదా. నాకు సమస్యలు వస్తాయి. నేను ఎదుర్కొంటున్న అనారోగ్యానికి సంబంధించి ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఇప్పటికే నాలుగు సెషన్ల ట్రీట్‌మెంట్ పూర్తైంది" అని శివ రాజ్‌కుమార్ చెప్పుకొచ్చారు.
"నా అనారోగ్య సమస్యల వల్ల ఒప్పుకున్న సినిమాలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. కొత్త సినిమాల చిత్రీకరణలతో పాటు, రిలీజ్‌కు రెడీగా ఉన్న సినిమాల ప్రచార కార్యక్రమాల్లో నిర్విరామంగా పాల్గొంటున్నాను. సర్జరీ కోసం అమెరికా వెళ్లనున్నాను. ఆ తర్వాత నెల రోజుల పాటు రెస్ట్ తీసుకుంటాను. నేను నటిస్తున్న సినిమాల దర్శకులు, నిర్మాతలకు కూడా ఈ విషయం తెలుసు. అందుకు తగినట్లు షెడ్యూల్స్ రెడీ చేసుకున్నా. రాబోయే రెండు నెలల్లో అన్నీ సర్దుకుంటాయి. " అని శివ రాజ్‌కుమార్ అన్నారు.
Shiva Rajkumar upcoming Movies : ఇక శివ రాజ్‌కుమార్ సినిమాల విషయానికొస్తే ఆయన 'ఉత్తరకాండ', '45', 'భైరవుడు'తో పాటు తెలుగులో రామ్‌చరణ్ - బుచ్చిబాబు సినిమాలో నటిస్తున్నారు.
ఒక క్షణంలో నవ్వుతూ.. మరో నిమిషంలో బాధతో బాలయ్య-శివన్న.. ఇదే కదా జీవితం
మెట్లపై నుంచి జారిపడ్డ విజయ్ దేవరకొండ - ఇప్పుడు హీరోకు ఎలా ఉందంటే?