Double Ismart Teaser: ఎనర్జిటిక్ స్టార్ రామ్- సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న 'డబుల్ ఇస్మార్ట్' మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. సినిమా టీజర్ రిలీజ్ డేట్‌ను డైరెక్టర్ పూరి సోషల్ మీడియాలో ప్రకటించారు. అందరూ అనుకున్నట్లుగానే రామ్ పుట్టినరోజు (మే 15) సందర్భంగా టీజర్ రిలీజ్ కానుంది. 'ఎంతగానో ఎదురుచూస్తున్న డబుల్ ఇస్మార్ట్ అప్డేట్ వచ్చేసింది. 'ది మాక్కికిరికిరి' డబుల్ ఇస్మార్ట్ టీజర్ మే 15న రానుంది. రెడీగా ఉండండి' అని పూరి రాసుకొచ్చారు. దీంతో చాలా రోజుల తర్వాత సాలిడ్ అప్డేట్ రావడం రామ్ ఫ్యాన్స్‌లో జోష్ నిండినట్లైంది.
-
The most awaited update of the highly anticipated #DoubleISMART is here 😎
— Puri Connects (@PuriConnects) May 12, 2024
The blazing 𝗱𝗶𝗠𝗔𝗔𝗞𝗜𝗞𝗜𝗥𝗜𝗞𝗜𝗥𝗜 #DoubleISMARTTeaser on MAY 15th ❤️🔥
Stay tuned for LOADS of MASSIVE FIRE CRACKERS 🧨🔥⚡️
Ustaad @ramsayz #PuriJagannadh @duttsanjay #ManiSharma @Charmmeofficial… pic.twitter.com/iEVRblCXNn
షూటింగ్ రీ స్టార్ట్: 2019లో బ్లాక్‌బస్టర్ హిట్టైన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్‌గా ఇది తెరకెక్కుతోంది. తొలి భాగం సూపర్ హిట్ అవ్వడం వల్ల సీక్వెల్‌పై అందరకి అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. కానీ, కొన్ని నెలల నుంచి సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడం వల్ల మూవీ ఆగిపోయిందనుకున్నారంతా. కానీ, రీసెంట్గా సినిమా షూటింగ్ పునః ప్రారంభమైందని దర్శకుడు పూరి తెలిపారు. సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తున్నట్లు చేస్తున్నట్లు ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా ఆయన షేర్ చేశారు. 'మరో షెడ్యూల్ ప్రారంభిస్తున్నాం. పలు కీలక సన్నివేశాలు ఈ షెడ్యూల్లో షూట్ చేయనున్నాం' అని పూరీ ట్వీట్లో రాసుకొచ్చారు. దీంతో రామ్ ఫ్యాన్స్ కాస్త రిలాక్స్ అయ్యారు.
అయితే గతేడాది షూటింగ్ ప్రారంభించిన మేకర్స్, సినిమాను 2024 మార్చి 8న రిలీజ్ చేయనున్నట్లు అప్పుడే మేకర్స్ ప్రకటించారు. కానీ, పలు కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది. ఇక షూటింగ్ రీ స్టార్ట్ కావడం వల్ల మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ, హీరోయిన్ ఎవరన్న క్లారిటీ రాలేదు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
రామ్ 'డబుల్ ఇస్మార్ట్'- ఆరోజు అప్డేట్ పక్కా! - Double Ismart Update
'డబుల్ ఇస్మార్ట్' క్రేజీ అప్డేట్- రామ్ ఫ్యాన్స్‌లో జోష్ నింపిన పూరి - Double Ismart Shooting