Rakul Jackky Marriage Photos : బాలీవుడ్ స్టార్ కపుల్ రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ ఎట్టకేలను ఒకటయ్యారు. గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట నేడు (ఫిబ్రవరీ 21న) రెండు సంప్రదాయాల్లో వివాహం చేసుకున్నారు. గోవాలోని ఓ స్టార్ హోటల్లో పంజాబీ అలాగే సింధి పద్దతిలో ఈ జంట పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోలను ఈ స్టార్ కపుల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీటిని చూసిన ఫ్యాన్స్ కొత్త జంటకు విషెస్ చెప్తున్నారు.
సంగీత్‌లో బాలీవుడ్ కపుల్స్ డ్యాన్స్
Rakul Jacky Prewedding Celebrations : ఇప్పటికే వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకలు కూడా చాలా గ్రాండ్‌గా జరిగాయి. పెళ్లికి వచ్చిన అతిథులు తాజాగా జరిగిన సంగీత్‌లో సందడి చేశారు. బాలీవుడ్ కపుల్స్ వరుణ్ ధావన్ నటాషా, శిల్పాశెట్టి- రాజ్ కుంద్రా ఇలా పలువురు స్టార్స్ సంగీత్‌లో పాల్గొని స్టెప్పులేశారు. ఇక హల్దీ, మెహందీ వేడుకలు కూడా బాగా జరిగాయి. గతంలో ఈ జంట తమ ఫ్రెండ్స్‌కు గ్రాండ్ బ్యాచిలరేట్ పార్టీ కూడా ఇచ్చారు. దీంతో పాటు ఈ జంట వెడ్డింగ్ కార్డ్ కూడా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యింది. అబ్ దోనో భాగ్నా - నీ ( ఇక ఇద్దరు ఎక్కడికి పరిగెట్టద్దు అని అర్థం, దీంతో పాటు జాకీ భాగ్నానీ సర్ నేమ్‌ను కూడా ఇందులో మెన్షన్ అయ్యింది) అనే హ్యాష్ ట్యాగ్‌ను ప్రింట్ చేశారు. సరికొత్తగా ఉన్న ఈ హ్యాష్‌ట్యాగ్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
Rakul Preet Singh Career : ఇక రకుల్ కెరీర్ విషయానికి వస్తే - 'గిల్లీ' అనే కన్నడ చిత్రంతో సినీ తెరంగేట్రం చేసింది రకుల్. 2013లో వచ్చిన 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్'తో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ సక్సెస్‌తో నటిగా మంచి మార్కులు కొట్టేసిన రకుల్, ఆ తర్వాత టాలీవుడ్లో వరుస అవకాశాలు అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్‌లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆమె కీలక పాత్ర పోషించిన 'ఇండియన్ 2' (భారతీయుడు 2) విడుదలకు సిద్ధమవుతోంది.