Rajinikanth Robo Movie : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్, సూపర్‌స్టార్ రజనీకాంత్ కాంబోలో 2010లో రిలీజ్ అయిన బ్లాక్‌బస్టర్ మూవీ 'రోబో'. గత దశాబ్దంలో వచ్చిన బెస్ట్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీస్‌లో ఇదీ ఒకటి. ఈ ప్రతిష్ఠాత్మక సినిమాకు ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. అయితే ఈ మూవీలో ఓ లెజెండరీ పాప్ సింగర్‌తో డైరెక్టర్ శంకర్ ఒక్క సాంగ్ పాడించాలనుకున్నారని మీకు తెలుసా? ఇటీవల మలేసియాలో జరిగిన ఈవెంట్లో ఆ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.
"2009లో నేను ఓ ఫ్రెండ్‌ను కలిశాను. అతడు మైకేల్ జాక్సన్ కూడా సన్నిహితుడు. ఆ విషయం తెలుసుకుని నేను జాక్సన్‌ని కలవాలని నా ఫ్రెండ్‌ను అడిగాను. కానీ అప్పుడు నాకు ఆ ఛాన్స్ దొరకలేదు. అయితే ఆ తర్వాత నేను ఆస్కార్‌కి నామినేట్ అయినప్పుడు నాకు మైకేల్ నుంచి ఇన్విటేషన్ వచ్చింది. కానీ ఆస్కార్ అందుకున్న తర్వాతనే నేను జాక్సన్‌ను కలవాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లే అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం తర్వాత మైకేల్ జాక్సన్‌ను కలిశాను." అంటూ రెహమాన్ అప్పటి మెమరీస్‌ను గుర్తు చేసుకున్నారు.
అప్పుడే తనతో కలిసి పని చేయాలనే కోరికను వ్యక్తం చేసినట్లు రెహమాన్ వెల్లడించారు. 'రోబో' తమిళ వెర్షన్ కోసం ఓ పాట పాడించాలని అనుకున్నారని, ఈ విషయంపై డైరెక్టర్ శంకర్ కూడా ఆసక్తి చూపించారని పేర్కొన్నారు. అయితే దురదృష్టవశాత్తు పాప్ స్టార్ అనారోగ్యంతో కన్నుమూశారని రెహమాన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక రోబో సినిమా విషయానికి వస్తే, 2010లో విడుదలైన ఈ మూవీని సన్‌పిక్చర్స్ నిర్మించింది. ఇందులో ఐశ్వర్య రాయ్ బచ్చన్, డానీ డెంజోంగ్పా, సంతానం, కరుణాస్, కళాభవన్ మణి కీలక పాత్రలు పోషించారు. శాస్త్రవేత్త వసీకరన్, అతని రోబో చిట్టి చుట్టూ కథ తిరుగుతుంది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ సాధించింది. ముఖ్యంగా ఇందులోని సాంగ్స్ మ్యూజిక్ లవర్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి.
ఏఆర్ రెహమాన్ మ్యాజిక్ - 'లాల్ సలామ్' కోసం ఆ దివంగత సింగర్స్ గాత్రం
తొలి సినిమాతోనే నేషనల్ అవార్డు - రెహమాన్ పేరిట ఉన్న ఆ వీధి ఎక్కడుందంటే ?