ETV Bharat / entertainment

రజనీకాంత్‌, కమల్​హాసన్​తో శంకర్​ సినిమాటిక్‌ యూనివర్స్‌! - Indian 2 Director Shankar

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 29, 2024, 12:46 PM IST

Shankar Indian 2 Movie : సినిమాటిక్‌ యూనివర్స్‌పై దర్శకుడు శంకర్‌ స్పందించారు. ఈ క్రమంలోనే ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. పూర్తి వివరాలు స్టోరీలో

source ETV Bharat
Rajinikanth Kamalhassan (source ETV Bharat)

Shankar Indian 2 Movie : ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో పాన్ ఇండియాతో పాటు సినిమాటిక్‌ యూనివర్స్‌ కూడా ఎక్కువగా వినిపించడం ప్రారంభమైంది. ఓ సినిమాలోని కథా ప్రపంచాన్ని లేదా, అందులోని పాత్రలను మరో సినిమాకు కనెక్ట్​ చేస్తూ కొనసాగించడాన్నే సినిమాటిక్​ యూనివర్స్‌ అంటారు. మొదట ఇలాంటి ట్రెండ్​ హాలీవుడ్‌లో మొదలైంది.

ఆ తర్వాత ఇదే ట్రెండ్ వైపు​ బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్‌ అడుగులు వేస్తున్నాయి. సౌత్ ఇండస్ట్రీకి దాన్ని పరిచయం చేసిన క్రెడిట్​ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌దే. ఖైదీ (2019), విక్రమ్‌ (2022), లియో(2023) సినిమాలు ఆ కోవకే వస్తాయి. అయితే 2008లోనే ఆ సాహసం చేయాలని డైరెక్టర్ శంకర్ ప్రయత్నించారని తెలిసింది. కానీ, అది కార్యరూపం దాల్చలేదు.

తాజాగా ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. "రోబో షూటింగ్​ టైమ్​లో నాకు సినిమాటిక్‌ యూనివర్స్‌ చేయాలనే ఆలోచన వచ్చింది. భారతీయుడు, ఒకే ఒక్కడు, శివాజీలోని హీరోల పాత్రలను కలుపుతూ ఓ సినిమా చేయాలనిపించింది. ఈ విషయాన్ని నా అసిస్టెంట్‌ డైరెక్టర్లకు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు వివరించాను. వారందరూ నవ్వారు. వారి సపోర్ట్ దక్కక నా ఆలోచనను మానుకున్నాను. కానీ ఆ తర్వాత అవెంజర్స్‌ వచ్చింది. దీంతో కొత్త తరహా ఆలోచనలతో సినిమా తీయాలనుకుంటే తీసేయండి. లేదంటే ఇంకెవరో చేస్తారు అని నా అసిస్టెంట్లకు చెప్పారజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, అర్జున్‌: ‘సినిమాటిక్‌ యూనివర్స్‌’పై శంకర్‌ ఏమన్నారంటే? అని చెప్పారు శంకర్. అప్పుడు శంకర్​ అనుకున్నది చేసి ఉంటే శంకర్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఫస్ట్‌ యూనివర్స్‌ అయ్యేది.

కాగా, శంకర్ దర్శకత్వం వహించిన భారతీయుడు 2 జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. కమల్‌ హాసన్‌ హీరోగా నటించారు. సిద్ధార్థ్‌, ప్రియా భవానీ శంకర్‌ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. అలానే రామ్‌ చరణ్​తో గేమ్​ ఛేంజర్ సినిమా కూడా చేశారు శంకర్‌. ఇది త్వరలోనే రిలీజ్ కానుంది. ప్రస్తుతానికి రిలీజ్ డేట్​పై క్లారిటీ లేదు.

'కల్కి' కలెక్షన్స్ - రెండో రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే? - Kalki 2898 AD Day 2 Collections

అమెరికాలో 'కల్కి' వసూళ్ల సునామీ - మైండ్ బ్లోయింగ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.