ETV Bharat / entertainment

'ఆ దర్శకుడిని ముసుగేసి కొడితే రూ.10 వేలు'- జక్కన్న షాకింగ్ ఆఫర్! - Rajamouli - RAJAMOULI

Rajamouli Anil Ravipudi : దర్శకుడు రాజమౌళి స్టేజ్​పై ఓ ఆఫర్ ప్రకటించారు. ఆ దర్శకుడిని ముసుగేసి కొడితే వాళ్లకి రూ. 10 వేలు ఇస్తా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు!

.
.
author img

By ETV Bharat Telugu Team

Published : May 2, 2024, 6:48 AM IST

Rajamouli Anil Ravipudi : దర్శకుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్​లో ఒక్క పరాజయం లేకుండా వరుస సక్సెస్​లు సాధిస్తూ కెరీర్​లో ముందుకెళ్తున్నారు. ఈయన తర్వాత టాలీవుడ్​లో ఫ్లాపులు లేకుండా అన్నీ విజయాలతో ముందుకెళ్లే మరో దర్శకుడు ఎవరంటే అనిల్ రావిపూడి. అయితే తాాజాగా అనిల్ రావిపూడిపై రాజమౌళి ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎవరైనా అనిల్‌పై ముసుగేసి కొడితే వాళ్లకి రూ. 10 వేలు ఇస్తా అంటూ నవ్వులు పూయించారు.

అసలు ఏం జరిగిందంటే? - సత్యదేవ్‌ హీరోగా రూపొందిన యాక్షన్‌ ఫిల్మ్​ కృష్ణమ్మ(Krishnamma). వి.వి. గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్​ కొరటాల శివ సమర్పింటారు. మే 10న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మూవీటీమ్ హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించి దర్శకులు రాజమౌళి, అనిల్‌ రావిపూడి, గోపీచంద్‌ మలినేని చీఫ్ గెస్ట్​లుగా ఆహ్వానించింది.

అప్పుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ "సినిమాను మొదలుపెట్టిన రోజే జక్కన్న కథ చెప్పేస్తారు. #SSMB29 ఏ జానరో తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ విషయం గురించి ఇప్పుడు ఈ వేదికపై చెబుతారని ఆశిస్తున్నాను" అని అనిల్‌ ఫన్నీగా అన్నారు. దానికి జక్కన్న "ఎవరైనా అనిల్‌పై ముసుగేసి కొడితే వాళ్లకి రూ. 10 వేలు ఇస్తానంటూ" స్టేజ్​పై నవ్వులు పూయించేలా రిప్లై ఇచ్చారు.

అలాంటి వారిలో సత్య ఒకరు - "ప్రెజెంటర్‌గా పరిచయం అవుతున్న కొరటాల శివకు నా తరఫున శుభాకాంక్షలు చెబుతున్నాను. ఈ చిత్రం మంచి సక్సెస్ అందుకోవాలని ఆశిస్తున్నాను. ఎలాంటి పాత్రలోనైనా సత్యదేవ్‌ ఈజీగా ఒదిగిపోయి నటిస్తారు. పూర్తిస్థాయి నటన కనబరిచే వారిలో సత్య ఒకరు. ఆయన టాలెంట్​ ఎలాంటిదో అందరికీ తెలుసు. ఈ కృష్ణమ్మ ఆయనకు స్టార్‌డమ్‌ తీసుకొస్తుందని భావిస్తున్నాను" అని జక్కన్న పేర్కొన్నారు.

సత్యదేవ్‌ కటౌట్‌ సెట్‌ - "చిన్న చిన్న పాత్రలతో కెరీర్‌ను మొదలుపెట్టి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు సత్యదేవ్‌. ఏ కథకైనా, పాత్రకైనా ఆయన కటౌట్‌, వాయిస్‌ బాగా సెట్‌ అవుతుంది. ఐపీఎల్‌ను రెండు, మూడు రోజులు పక్కనపెట్టేయండి. థియేటర్లకు వెళ్లి సినిమాను చూడండి" అంటూ అనిల్‌ ప్రేక్షకులను కోరారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కోపంతో రణ్​బీర్ కపూర్​ను కొట్టిన సల్మాన్ ఖాన్​ - అసలేం జరిగిందంటే? - Salman Khan RanbirKapoor

యాక్షన్ మోడ్​లో అందాల భామలు - తుపాకీతో బాక్సాఫీస్​కు గురి పెట్టి! - Tollywood Heroine Action Movies

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.