ETV Bharat / entertainment

ధనుశ్ కామెంట్స్​తో ఎన్టీఆర్​, పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ! - Raayan Dhanush - RAAYAN DHANUSH

Raayan Dhanush : కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్​ చేసిన కామెంట్స్​తో పవన్ కల్యాణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇంతకీ ఆయన ఏం అన్నారంటే?

Source ETV Bharat
Dhanush (Source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 22, 2024, 6:36 AM IST

Raayan Dhanush Favourite Tollywood Star : కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన విలక్షణ నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వీయదర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రాయన్. జులై 26న థియేటర్లలో రిలీజ్​కు సిద్ధమైంది.

ఈ చిత్రంపై ఆడియెన్స్​లో, అభిమానుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్​గా ట్రైలర్ విడుదలతో సినిమాపై మరింత అంచనాలను పెరిగాయి. ఈ క్రమంలోనే తాజాగా మూవీటీమ్​ ప్రీ రిలీజ్ ఈవెంట్​ను హైదరాబాద్​లో నిర్వహించింది.

ఈ సందర్భంగా ధనుశ్ పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. టాలీవుడ్​లో తన ఫేవరెట్ హీరో ఎవరో తెలిపారు. యాంకర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ 'ఐ లవ్ సినిమా, ఐ లవ్ పవన్ కళ్యాణ్ సర్' అంటూ చెప్పుకొచ్చారు. ధనుశ్​ చేసిన ఈ కామెంట్స్​కు ఆడిటోరియం దద్దరిల్లిపోయింది.

Dhanush Tollywood Multistarrer Film : 'ఒకవేళ మల్టీ స్టారర్ చేయాలంటే ఎవరితో చేస్తారు? సూపర్ స్టార్ మహేశ్​ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్. వీరిలో ఎవరితో చేస్తారు?' అని యాంకర్ మరో ప్రశ్న అడగగా, అందుకు జూనియర్ ఎన్టీఆర్ అని సమాధానం ఇచ్చారు ధనుశ్​. ఈ ఆన్సర్​తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా మాట్లాడుతూ "నాకు సరైన టైమ్​లో సరైన దర్శకులు, నటులతో కలిసి వర్క్​ చేసే ఛాన్స్ వచ్చినందుకు గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. నా తప్పుల నుంచే ఎక్కువ నేర్చుకున్నాను. నాకు యాక్టింగ్​పై ఎంత ప్రేమ ఉందో, దర్శకత్వంపైనా అంతే ఇష్టముంది. ఆ ఇష్టం నుంచి వచ్చినదే ఈ రాయన్‌". అని అన్నారు

ఇకపోతే రాయన్ సినిమాలో సెల్వ రాఘవన్, ప్రకాశ్ రాజ్, ఎస్.జే.సూర్య, కాళిదాస్, సందీప్ కిషన్, దుషరా విజయన్, జయరామ్, వరలక్ష్మి శరత్ కుమార్, అపర్ణ బాలమురళీ, శరవణన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. సన్ పిక్చర్స్ బ్యానర్​పై భారీ బడ్జెట్​తో సినిమాను నిర్మించారు. ఆస్కార్ అవార్డు విన్నర్ రెహమాన్ సంగీతం అందించారు. ధనుశ్ కెరీర్​లో 50 వ చిత్రంగా ఇది తెరకెక్కింది.

ధనుశ్ సినిమాలో పాన్​ఇండియా బ్యూటీ - 'తేరే ఇష్క్‌ మే' షూటింగ్ ఎప్పుడంటే? - Dhanush New Bollywood

Movie

టాలీవుడ్ బాక్సాఫీస్​పై తమిళ సినిమాల వార్ - ​త్వరలోనే రానున్న చిత్రాలివే! - Tollywood Boxoffice Tamil Movies

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.