ETV Bharat / entertainment

బన్నీ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్- ఒక్కరోజు ముందుగానే 'పుష్ప 2' రిలీజ్ - PUSHPA 2 RELEASE DATE

పుష్ప విడుదల తేదీలో మార్పు- కొత్త డేట్​ అనౌన్స్ చేసిన మేకర్స్- ఫుల్​ జోష్​లో బన్నీ ఫ్యాన్స్​

PUSHPA 2
PUSHPA 2 (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 24, 2024, 2:52 PM IST

Pushpa 2 Release Date : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సినిమా 'పుష్ప 2'. ఈ సినిమా గురించి మరికొన్ని విశేషాలు షేర్ చేసుకోవడానికి మేకర్స్ గురువారం ప్రెస్​మీట్ నిర్వహించారు. అయితే ఈ ప్రెస్​మీట్​లో మేకర్స్​ బన్నీ ఫ్యాన్స్​కు అదిరే న్యూస్ చెప్పారు. సినిమాను (డిసెంబర్ 6) ముందుగా ప్రకటించిన దానికంటే, ఒక రోజు ముందుగానే రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. అంటే డిసెంబర్ 05 నుంచే థియేటర్లలో 'పుష్ప' సందడి మొదలు కానుంది.

డే 1 అన్ని రికార్డులు బ్రేక్!
ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్​గా ఉన్నట్లు మేకర్స్ పేర్కొన్నారు. రిలీజ్ రోజే ఇండస్ట్రీలోని అన్ని రికార్డులను పుష్ప బ్రేక్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అటు కర్ణాటకలోనూ ఇప్పటివరకు అత్యధిక వసూళ్లలో టాప్​లో ఉన్న 'బాహుబలి 2'ను కూడా ఇది దాటేస్తుందని అన్నారు. ఒక్క కన్నడలోనే ఈ మూవీ రూ. 80 నుంచి రూ. 100 కోట్ల వరకు కలెక్షన్స్‌ చేస్తుందన్న నమ్మకం ఉందన్నారు.

ఆ ఒక్క సీన్​కు 35 రోజులు
సినిమాలో గంగమ్మ జాతర సన్నివేశం చిత్రీకరణకు దాదాపు 35రోజులు పట్టిందని నిర్మాత అన్నారు. ఈ సీన్​ కోసం హీరో అల్లు అర్జున్ ఎంతో కష్టపడ్డారని చెప్పారు. 'ఆ ఎపిసోడ్‌ చిత్రీకరణకు దాదాపు 35 రోజులు పట్టింది. దాని కోసం రిహార్సల్స్‌ కూడా చేశారు. ఈ ఎపిసోడ్‌ విషయంలోనే కాదు ప్రతి సన్నివేశం కోసం దర్శకుడు సుకుమార్‌, అల్లు అర్జున్‌ చాలా కష్టపడ్డారు. అందరూ ఊహిస్తున్నట్టే ఆ ఎపిసోడ్‌ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది' అని అన్నారు.

2021 లో బ్లాస్​బస్టర్ విజయం అందుకున్న పుష్ప ది రైజ్‌ సినిమాకు ఇది సీక్వెల్. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్​గా నటించింది. ఫహద్‌ ఫాజిల్‌, సునీల్‌, అనసూయ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్​పై ఈ సినిమా రూపొందింది. రాక్​స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

'పుష్ప పార్ట్ 3' కన్ఫార్మ్ - ప్రొడ్యూసర్​ సెన్సేషనల్ అనౌన్స్​మెంట్

'పుష్ప 2'లో యానిమల్ యాక్టర్​ - సుకుమార్ ప్లానింగ్​కు ఫ్యాన్స్ సర్​ప్రైజ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.