ETV Bharat / entertainment

బాక్స్​ఫీస్ వద్ద 'పుష్ప 2' ర్యాంపేజ్ - తొలి రోజు వరల్డ్​ వైడ్​గా ఎంత కలెక్ట్ చేసిందంటే? - PUSHPA 2 FIRST DAY COLLECTION

'పుష్ప 2' ఫస్ట్​ డే వరల్డ్​ వైడ్​గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Pushpa 2 Day 1 Collections
Pushpa 2 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 6, 2024, 8:52 AM IST

Pushpa 2 Day One Collection : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ లేటెస్ట్ మూవీ 'పుష్ప : రి రూల్‌' ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. రిలీజ్​కు ముందు నుంచే భారీ హైప్​ పెంచిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా ర్యాంపేజ్ సృష్టించింది. ప్రీ సేల్ బుకింగ్స్‌లోనే హవా చూపిన ఈ సినిమా తొలి రోజు వరల్డ్​వైడ్​గా రూ.175 కోట్లు వసూళ్లు చేసిందని ట్రేడ్‌ వర్గాలు అంచనా. అయితే ఈ కలెక్షన్స్​లో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల వాటా ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక అమెరికాలో ఈ సినిమా ఫస్ట్ డే సుమారు 4.2 మిలియన్ల డాలర్లు (రూ.35 కోట్లకు పైన) కలెక్షన్ సాధించినట్లు నిర్మాణ సంస్థ తాజాగా వెల్లడించింది. ఈ విషయాన్ని ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా షేర్ చేసింది. అమెరికాలో ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన మూడో భారతీయ చిత్రం 'పుష్ప 2' అనే క్యాప్షన్ దానికి జోడించింది.

గంటలోనే లక్ష టికెట్లు!
ఇదిలా ఉండగా, ఈ సినిమా ప్రీ సేల్‌ బుకింగ్స్‌ నుంచే బుక్‌ మై షోలో ‘పుష్ప 2’ దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం మరోసారి హవా చూపింది. ఈ ప్లాట్‌ఫామ్‌పై ఒక్క గంటలోనే లక్ష టికెట్స్ అమ్ముడయ్యాయి. గతంలో ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’ సినిమా గంటలో 97,700 టికెట్స్‌తో టాప్‌లో ఉంది. ఇప్పుడు ఆ మార్క్‌ను పుష్పరాజ్‌ దాటేశాడు.

ఇక ఇక 'పుష్ప 2' సినిమా విషయానికి వస్తే డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించారు. నేషనల్ క్రష్​ రష్మిక మందన్నా ఈ చిత్రంలో శ్రీ వల్లి అనే పాత్రలో మెరుస్తుండగా, మాలీవుడ్​ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ భన్వర్​లాల్ షెకావత్​గా అలాగే సీనియర్ నటులు జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్​లు స్ట్రాంగ్​ క్యారెక్టర్లలో కనిపించనున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి అదిరిపోయే సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్​పై రవి శంకర్, నవీన్ ఈ సినిమాకు సంయుక్తంగా ప్రోడ్యూస్ చేశారు.

'పుష్ప 2'పై సెలబ్రిటీల రివ్యూ - ఏం అన్నారంటే?

'గంగోత్రి' టు 'పుష్ప'​ - రూ. 100 నుంచి రూ.300కోట్ల వరకూ​! - బన్నీ సినీ జర్నీ ఎలా సాగిందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.