ETV Bharat / entertainment

రూ.165 కోట్ల విల్లాను వీడిన జోనస్​ కపుల్​ - కారణమేంటే ? - ప్రియాంకా చోప్రా లేటెస్ట్ న్యూస్

Priyanka Chopra House : ఎంతో ఇష్టపడి కొన్న విలాసవంతమైన విల్లాను బాలీవుడ్​ బ్యూటీ ప్రియాంక దంపతులు ఖాళీ చేశారట. ఈ మేరకు అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇంతకీ ఉన్నట్టుండి ఆమె ఇళ్లు ఎందుకు ఖాళీ చేయాల్సి వచ్చిందంటే?

Priyanka Chopra Shifted New House
Priyanka Chopra Shifted New House
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2024, 5:42 PM IST

Priyanka Chopra House : యూఎస్​లో స్థిరపడ్డ ప్రముఖ బాలీవుడ్‌ నటి ప్రియాంకా చోప్రా దంపతులు తాము ప్రస్తుతం ఉంటున్న నివాసాన్ని ఖాళీ చేశారట. అయితే ఇందుకు గల కారణాలను తెలుపుతూ అక్కడి స్థానిక మీడియాలో పలు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే ?

అసలేం జరిగిందంటే ?
బాలీవుడ్​లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియాంకా చోప్రా. అమెరికాకు చెందిన పాప్‌ సింగర్‌ నిక్‌ జొనాస్‌ను వివాహం చేసుకొని యూఎస్​లో స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో లాస్‌ ఏంజిలెస్‌లో 20 మిలియన్‌ డాలర్లు వెచ్చించి ఓ విలాసవంతమైన​ విల్లాను కొన్నారు. ఇందులోనే భర్త, బిడ్డతో ఆమె ప్రస్తుతం ఉంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం వాళ్లు ఉన్న ఆ భవనాన్నిఖాళీ చేశారట. దీంతో ఏం జరిగిందంటూ అందరూ ఆరా తీయడం మొదలెట్టారు.

తీరా చూస్తే ఆ ఇంట్లోని అనేక ప్రదేశాల్లో నీళ్లు లీక్‌ అవుతున్నాయని, దాని వల్ల ఇంట్లోని చాలా ప్రాంతాలు దెబ్బతిన్నాయని ప్రియాంక దంపతులు ఆ ఇంటిని వీడారంటూ ఇంగ్లీష్​ పత్రికల్లో కథనాలు వెలువడుతున్నాయి.అంతే కాకుండా తమకు ఇళ్లు అమ్మిన వ్యక్తి నుంచి నష్ట పరిహారం ఇప్పించాలంటూ ప్రియాంక కోర్టులో దావా కూడా వేశారట. అయితే ఈ విషయంపై అటు ప్రియాంక గానీ ఇటు నిక్​ గానీ స్పందించలేదు.

Priyanka Chopra House Worth : ఎంతో ఇష్టపడి కొన్న ఈ లగ్జరీయస్​ విల్లాను ప్రియాంక తన అభిరుచులకు తగ్గట్లుగా తీర్చిదిద్దుకున్నారాట. ఈ ఇంటిలో ఏడు బెడ్​ రూమ్​లు, తొమ్మిది బాత్‌రూమ్‌లు, టెంపరేచర్ కంట్రోల్డ్ వైన్ సెల్లార్, చెఫ్ కిచెన్, హోమ్‌ థియేటర్, స్పా, స్టీమ్ షవర్, జిమ్‌, బిలియర్డ్స్ రూమ్ ఇలా అనేక సదుపాయాలు ఉన్నాయి. తమ పిల్లలతో గడిపే ప్రతి క్షణం అమూల్యమైనదిగా ఉండాలని ప్రియాంక - నిక్‌ దంపతులు ఆ ఇంటిని కొనుగోలు చేశారని సమచారం. తమ ఆలోచనలకు అనుగుణంగా కొన్ని మార్పులు చేయించారట. ఇంటి బయట అవుట్‌డోర్‌ స్పేస్‌, పచ్చదనం ఎక్కువ ఉండేలా తయారు చేయించుకున్నారట. సినీ వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం ఆ ఇంటి విలువ సుమారు రూ.165 కోట్లు ఉంటుందని అంచనా. అయితే దీనికి మరమ్మతులు చేయించడానికి దాదాపు 2.5 మిలియన్‌ డాలర్లు ఖర్చు కావొచ్చట.

వ‌య‌సు పెరిగినా తగ్గని క్రేజ్‌, సంపాద‌న- భారత్​లోనే రిచ్చెస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా?

సమంత రూట్​లో ప్రియాంక!.. ఎందుకలా చేసింది?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.