ETV Bharat / entertainment

పాత్ర కోసం ప్రాణం పణంగా పెట్టిన స్టార్ హీరో - 72గంటల పాటు కేవలం నీళ్లనే తాగి

Prithviraj Sukumaran Aadujeevitham : ఓ స్టార్ హీరో తాను చేసిన పాత్ర కోసం షూటింగ్ సమయాల్లో ఏకంగా 72 గంటల పాటు తిండి తినకుండా ఉన్నారట. ఒకసారి కూడా సినిమా పూర్తయ్యేవరకు పలు సార్లు ఇలానే చేశారట. ఇంతకీ ఆయన ఎవరు? ఆ సినిమా ఏంటి తెలుసుకుందాం.

పాత్ర కోసం ప్రాణం పణంగా పెట్టిన స్టార్ హీరో - 72గంటల పాటు కేవలం నీళ్లనే తాగి
పాత్ర కోసం ప్రాణం పణంగా పెట్టిన స్టార్ హీరో - 72గంటల పాటు కేవలం నీళ్లనే తాగి
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 21, 2024, 8:21 AM IST

Prithviraj Sukumaran Aadujeevitham : కథ, పాత్ర కోసం తమని తాము మార్చుకునే నటీనటులు అతికొద్ది మందే ఉంటారు. అలాంటి వారిలో మలయాళ డైరెక్టర్​ కమ్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఒకరు. రీసెంట్​గా ఆయన ప్రభాస్ సలార్​ చిత్రంలో మరో హీరోగా నటించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆయన కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ఆడు జీవితం : ది గోట్‌ లైఫ్‌. బ్లెస్సీ దర్శకత్వం వహించి తెరకెక్కించారు. దాదాపు ఐదేళ్ల పాటు షూటింగ్‌ జరుపుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు మార్చి 28న రిలీజ్​కు రెడీ అయింది. మలయాళ భాషతో పాటు తెలుగులోనూ రానుంది. ఈ నేపథ్యంలో షూటింగ్‌ విశేషాలతో పాటు, తన పాత్ర కోసం పడిన కష్టాన్ని తెలిపారు పృథ్వీరాజ్.

"ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు 98 కిలోల బరువు పెరిగాను. ఆ తర్వాత ఏకంగా 31 కిలోలు తగ్గాను. 67 కిలోల వరకు వచ్చాను. ఎందుకంటే ఎడారిలో దారి తప్పిపోయి, ఆకలితో అలమటించే వ్యక్తిగా కనపడాలంటే నేను కూడా భోజనం మానేయాలని నిర్ణయించుకున్నాను. కొద్ది రోజుల పాటు తినడం మానేసిన వ్యక్తి ఎలా కనిపిస్తారో అలాగే నేను కూడా కనపడాలనుకున్నాను. అందుకోసం చాలా సార్లు తినకుండా కూడా ఉండేవాడిని. కొన్నిసార్లైతే 72 గంటల పాటు కేవలం మంచి నీళ్లు మాత్రమే తాగేవాడిని. లేదంటే కొద్దిగా బ్లాక్‌ కాఫీ తాగేవాడిని. ఇలాంటివి చేసేటప్పుడు మానసికంగానూ దీనికి సిద్ధంగా ఉండాలి. మనిషి శరీరం ఆహారం తినకపోయినా రెండు, మూడు రోజులు పాటు ఉంటుంది. కానీ, రెండో రోజు నుంచే ఏదైనా తినాలి అంటూ మెదడు కూడా చెబుతూ ఉంటుంది. ఇది పెద్ద సవాల్ లాంటింది" అంటూ చెప్పుకొచ్చారు.

కాగా, ఈ చిత్రంలో పృథ్వీరాజ్‌ నజీబ్‌ అనే యువకుడిగా నటించారు. జీవనోపాధి కోసం కేరళ నుంచి మధ్య ప్రాశ్చ్యానికి వెళ్లిన ఓ యువకుడు బానిసగా ఎలా మారాడు? అక్కడి నుంచి తప్పించుకుని ఎలా బయటపడ్డాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అనే అంశాలతో సినిమాను తెరకెక్కించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

OTTలోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్ యాక్షన్​ థ్రిల్లర్​ ఫైటర్ - కానీ ఓ ట్విస్ట్!

ఇన్నేళ్లైనా అందాల నటి శోభన ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.