Premalu Movie OTT : 2024 ఏడాది మొదలై ఇప్పటి మూడు నెలలు కావొస్తోంది. ఈ సారి ఎన్నో కొత్త సినిమాలు ఎప్పటిలాగే బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డాయి. రీజనల్ నుంచి పాన్ ఇండియా వరకు ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. అయితే మలయాళంలో విడుదలైన పలు సినిమాలు తెలుగులో సూపర్‌హిట్ టాక్ అందుకున్నాయి. అందులో 'ప్రేమలు' ఒకటి. సుమారు 9 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ అందుకుని దూసుకెళ్తోంది. యూత్‌కు సంబంధించిన స్టోరీ దీంతో పాటు కొత్త ఎలిమెంట్స్ ఉండటం వల్ల ఈ చిత్రానికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు.
సచిన్ (హీరో) తన లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేయాలన్న మనస్తత్వం ఉన్న కుర్రాడు. అయితే అతడు అంజలి అనే అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తాడు. కాలేజ్ ఆఖరి రోజు తన లవ్‌ను ఆమెకు తెలియజేస్తాడు. అయితే ఆమె వేరొకరిని ప్రేమిస్తున్నట్లు చెప్పి సచిన్‌కు షాకిస్తుంది. ఆ బాధలో ఉన్నప్పుడే అతడి యూకే వీసా కూడా రిజెక్ట్ అవుతుంది. ఇలా వరుస దెబ్బలు తగలిన సమయంలో ఇంట్లో వాళ్లకు గేట్ కోచింగ్ పేరు చెప్పి అమూల్ అనే స్నేహితుడితో హైదరబాద్‌లో వాలిపోతాడు.
ఇక్కడ తన లైఫ్‌ను మళ్లీ జాలీగా గడపడం మొదలెడుతాడు. అప్పుడే సచిన్‌కు ఓ పెళ్లిలో రీనూ రాయ్‌తో (మమితా బైజు) పరిచయం అవుతుంది. ఇక తనతో లవ్‌లో పడిపోతాడు. ఈ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఆమె తనతో చనువుగా ఉండటాన్ని చూసి ఒక రోజు ఆమెకు ఐ లవ్ యూ చెప్తాడు. కానీ రీనూ అతడి లవ్ ప్రపోజల్‌ను రిజెక్ట్ చేస్తుంది. నాకు నీ మీద ఎప్పుడూ అలాంటి ఫీలింగ్స్ రాలేదంటూ చెప్తుంది. దీంతో సచిన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. హైదరబాద్ కూడా వదిలి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే మిగతా స్టోరీ ? అయితే మలయాళంతో పాటు తెలుగులోనూ మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ సంచలనం రేపుతోంది. తాజాగా ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఆహా వేదికగా స్ట్రీమ్ అవుతోంది. అయితే ఈ సినిమాకు ఎందుకు ఇంత క్రేజ్ ఏర్పడిందంటే ?
టాక్ మొత్తం ఆ పాత్ర గురించే :
యూత్‌ఫుల్ లవ్ స్టోరీస్‌లో చాలా వరకు ఇదే స్టోరీ ఉంటుంది. ఓ మాస్ అబ్బాయి, ఓ క్లాస్ అమ్మాయిని లవ్ చేస్తాడు. కానీ తొలుత వాళ్ల లవ్ ట్రాక్ నడవదు. ఆ తర్వాత అదే స్టోరీలో ఎన్నో ట్విస్ట్‌లు వస్తుంటాయి. ప్రేమలు కూడా అలాంటి స్టోరీనే. కానీ ఇందులో హీరో హీరోయిన్ల నటన సినిమాకే ప్లస్ పాయింట్‌గా నిలిచింది. ముఖ్యంగా హీరోయిన్ మమితా బైజు ఈ చిత్రానికే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. రీనూ పాత్రలో ఆమె ఇట్టే ఒదిగిపోయింది. తన యాక్టింగ్, డ్రెస్సింగ్ స్టైల్‌కు యూత్ ఫిదా అయిపోయారు. ఎక్కడ చూసిన ఈమె గురించే టాక్ నడుస్తోంది.
ఆ రెండు అస్సలు లేవు :
ఇదిలా ఉండగా, విలన్స్‌తో ఫైట్స్ లాంటివి ఇందులో లేవు. అంతగా ట్విస్ట్‌లు కూడా మనకు అనిపించవు. అంతే కాకుండా హద్దు మీరిన రొమాంటిక్ సీన్స్ అస్సలు లేవు. అలా ఇవేం లేకుండానే ఓ సింపుల్ స్టోరీని తెరపై ఓ రేంజ్లో చూపించారు డైరెక్టర్. హీరో హీరోయిన్లతో పాటు ఇందులో కనిపించిన ప్రతి ఒక్క పాత్రది నేచురల్ యాక్టింగ్గానే ఉంటుంది. ఇప్పటి కాలంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన పలు మీమ్స్, డైలాగ్స్‌ను సినిమాలో చక్కగా చూపించారు. దీంతో రొటీన్ స్టోరీనే అయిన 'ప్రేమలు' ఇంకాస్త కొత్తగా అనిపించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
టాప్ ట్రెండింగ్‌లో మమితా బైజు - కుర్రాళ్ల మనసు దోచేస్తూ! - Premalu OTT
ప్రేమలు బ్యూటీ కూడా బన్నీకి వీర ఫ్యాన్!- నేషనల్ అవార్డ్ విన్నింగ్ రోజు ఏకంగా ఇంటికే వెళ్లిందట