ETV Bharat / entertainment

దీపికను ఆటపట్టించిన ప్రభాస్​ - ఈ ఫన్నీ వీడియో చూశారా? - Kalki 2898 AD Movie - KALKI 2898 AD MOVIE

Prabhas Deepika Padukone Kalki 2898 AD : కల్కి 2898 AD సినిమా సెట్‌లో తనకు బాగా నచ్చిన విషయాన్ని బయటపెట్టారు కమల్ హాసన్. అలానే ఇదే ఇంటర్వ్యూలో అమితాబ్​, ప్రభాస్​దీపికను సరదాగా ఆటపట్టించారు. పూర్తి వివరాలు స్టోరీలో

source ETV Bharat
kalki (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 24, 2024, 12:11 PM IST

Prabhas Deepika Padukone Kalki 2898 AD : కల్కి 2898 AD ప్రపంచవ్యాప్తంగా మరో మూడు రోజుల్లో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ప్రమోషన్స్‌లో భాగంగా సినిమాలోని ప్రధాన తారగాణం అంతా కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెలతో పాటు ప్రొడ్యూసర్లు స్వప్న, ప్రియాంకా దత్‌లు సినిమా గురించి, అందులో స్టార్ల పెర్ఫార్మెన్స్ గురించి సరదా ముచ్చట్లు పంచుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కమల్ హాసన్ కల్కి సినిమా సెట్‌లో తనకు బాగా నచ్చిన అంశాన్ని బయటపెట్టారు. "అక్కడ కెమెరాలు ఎన్ని ఉన్నాయి. స్టాఫ్ ఎంత మంది ఉన్నారని కాదు. వాళ్లంతా చాలా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉన్నారు. చాలా సెట్స్‌లో ఆ వాతావరణం మనకు కనిపించదు. శబ్దాలు అనేవి వస్తుంటాయి. కానీ ఈ సెట్​లో ప్రతి ఒక్కరూ చాలా క్రమశిక్షణగా ఉన్నారు. డైరక్టర్ నాగ్ అశ్విన్ కూడా క్యాజువల్‌గానే మాట్లాడారు. ఒక్కొక్కసారి ఆయనలో ఏదో మాట్లాడుకుంటూ గొణుక్కుంటున్నా మాకు వినిపించేది. అంత సైలంట్‌గా సెట్‌ను మెయిన్‌టైన్ చేశారని" ప్రశంసించారు.

దీపికను ఆటపట్టించిన అమితాబ్​, ప్రభాస్​ - ఇదే ఇంటర్వ్యూలో 'దీపికాను తొలిసారి తెలుగు సినిమా చేశారు. మీకు ఎలా అనిపించింద'ని అడగగా ఆమె సమాధానం చెప్పబోయింది. అంతలోపే అమితాబ్ జోక్యం చేసుకుని, "దీపికా నువ్వు చాలా సినిమాలు చేశావు. నిన్ను మోడరన్ ఏజ్ ఆర్టిస్ట్ అని పిలవాలి" అని కాంప్లిమెంట్ ఇచ్చారు. కమల్ హాసన్ కలగజేసుకుని ఆమె హాలీవుడ్‌లో కూడా సినిమాలు చేసేస్తుందని గుర్తు చేశారు. ఇక ప్రభాస్ కూడా ఆమెను ఆటపట్టిస్తూ "ఇప్పటివరకూ ఎవ్వరూ చేయని బిగ్గెస్ట్ ఇంటర్నేషనల్ యాడ్స్ కూడా చేస్తుంది" అని టీజింగ్ టోన్‌తో చెబుతుంటే ఇక చాలు ఆపమంటూ ప్రభాస్‌ చేతిని పట్టుకుని ఆపే ప్రయత్నం చేశారు. అనంతరం దీపికా మాట్లాడుతూ డైరక్టర్ నాగ్ అశ్విన్‌పై పొగడ్తలు కురిపించారు. విజువల్స్ కోసం మంచి టెక్నాలజీ యూజ్ చేయడంలో ఆయన విజన్ కనిపిస్తుందంటూ ప్రశంసించారు. ఇక ప్రెగ్నెంట్‌గా ఉన్న దీపికాపై ప్రభాస్ ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన వీడియోలు వైరల్ అయ్యాయి.
కాగా, 2024 జూన్ 27న సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా, అంతకంటే మూడు రోజుల ముందే అంటే జూన్ 24న ప్రత్యేక ఈవెంట్ ప్లాన్ చేసింది సినిమా యూనిట్. కృష్ణ జన్మస్థలం అయిన మధురలో సినిమాకు సంబంధించిన మ్యూజికల్ థీమ్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. సినిమాకు అశ్వనీదత్ సినిమాకు నిర్మాణ బాధ్యతలు చేపట్టగా, నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతం సంతోష్ నారాయణన్ సమకూరుస్తున్నారు.

ప్రభాస్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన అమితాబ్ - ఎందుకంటే?

ఈ వారం థియేటర్లలో ఒక్కటే సినిమా - కానీ OTTలో మాత్రం బోలెడు! - This Week Theatre OTT Releases

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.