ETV Bharat / entertainment

ప్రభాస్​, నీల్ బ్రొమాన్స్ - 'లవ్​ యూ సార్' అంటూ స్పెషల్ పోస్ట్ - Prabhas Instagram Story

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 4, 2024, 12:53 PM IST

Updated : Jun 4, 2024, 1:10 PM IST

Prabhas Instagram Story : రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా సోషల్ మీడియా వేదికగా 'సలార్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్​కు విష్ చేశారు. ఆ పోస్ట్​ను మీరూ ఓ లుక్కేయండి.

Prabhas Instagram Story
Prabhas Instagram Story (ETV Bharat Archives)

Prabhas Instagram Story : రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ఇన్​స్టాగ్రామ్ వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు. 'సలార్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్​కు ఆయన బర్త్​డే సందర్భంగా స్పెషల్ విషెస్​ చెప్పారు. అంతే కాకుండా ఓ ఇంట్రెస్టింట్ ఫొటో కూడా షేర్ చేశారు.

'సలార్' సెట్స్​లో ఆ ఇద్దరూ మాట్లాడుకుంటున్నట్లు ఉన్న ఓ బిహైండ్ ద సీన్స్ స్టిల్​ను షేర్ చేస్తూ, " లవ్ యూ సార్ హావ్​ ఏ బ్యూటిఫుల్ హ్యాపీ బర్త్​డే" అంటూ క్యాప్షన్​ జోడించారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇది చూసిన అభిమానులు కూడా ప్రశాంత్ నీల్​కు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు.

ఇదిలా ఉండగా, 'సలార్​'లో కీలక పాత్ర పోషించిన కోలీవుడ్ నటి శ్రియా రెడ్డి కూడా ప్రశాంత్ నీల్​కు విష్ చేశారు. ఈమె కూడా నీల్​తో సెట్స్​లో దిగిన ఫొటోలను షేర్​ చేశారు.

మరోవైపు 'ఎన్​టీఆర్ 31' మూవీ టీమ్​ కూడా ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేసి ప్రశాంత్​ నీల్​కు బర్త్​డే విషెస్ తెలిపారు. 'ఎన్​టీఆర్ 31' ప్రొడక్షన్ హౌస్ అయిన మైత్రీ మేకర్స్ ట్విట్టర్ వేదికగా ఓ చక్కటి క్యాప్షన్​ను కూడా జోడించారు. "మాస్ సినిమాలను రీ డిఫైన్ చేసి హీరోయిజానికి కొత్త బెంచ్‌మార్క్‌లు సెట్ చేసిన డైరెక్టర్. మ్యాన్ ఆఫ్ మాస్ కోసం ఆయన విజన్ బాక్సాఫీస్ సెన్సేషన్ కంటే తక్కువేం కాదు." అంటూ నీల్​ను పొగడ్తలతో ముంచెత్తారు.

ఇక సినీ వర్గాల సమాచారం ప్రకారం ప్రశాంత్‌ నీల్‌ ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్‌కు ఫైనల్‌ టచ్ ఇచ్చే పనిలో ఉన్నారట. ఇందులో భాగంగా మొత్తం ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా కంప్లీట్ చేసేందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. తారక్ ప్రస్తుతం వరుస షూటింగుల్లో బిజీగా ఉన్నందున ఆ చిత్రీకరణ పూర్తయ్యాకనే ఎన్టీఆర్‌ 31 సెట్స్​పైకి వెళ్లనుందని టాక్ నడుస్తోంది. అంతే కాకుండా ఈ ఏడాది చివరి త్రైమాసికంలో ఈ సినిమా షూటింగ్​ ప్రారంభం కానుందని సమచారం.

'NTR 31' సాలిడ్ అప్డేట్- ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ షూటింగ్ ఎప్పుడంటే? - NTR 31 Movie

పవర్​ఫుల్​ టైటిల్​తో 'NTR 31' - బర్త్​డే రోజు రివీల్! - JR NTR PRASANTH NEEL MOVIE

Last Updated : Jun 4, 2024, 1:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.