ETV Bharat / entertainment

పవర్‌ స్టార్ బర్త్‌డే స్పెషల్- 3సినిమాల నుంచి సూపర్ అప్డేట్స్‌- డోంట్ మిస్! - Pawan Kalyan Birthday Special - PAWAN KALYAN BIRTHDAY SPECIAL

Pawan Kalyan Birthday Special Updates : పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ బర్త్‌డే సందర్భంగా స్పెషల్ అప్డేట్స్ విడుదలవ్వనున్నాయి. అవేంటో ఈ స్టోరీలో చూద్దామా

Pawan Kalyan Birthday Special Updates
Pawan Kalyan (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 31, 2024, 7:27 PM IST

Pawan Kalyan Birthday Special Updates : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్‌డే త్వరలో ( సెప్టెంబర్ 2) రానుంది. ఈ నేపథ్యంలో ఓ వైపు అభిమానులు సంబరాలు చేసేందుకు సిద్ధంగా ఉండగా, మరోవైపు పలు మూవీ మేకర్స్ కూడా ఆయన బర్త్‌డే రోజున పలు కీలక అప్డేట్స్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. ఇంతకీ అవేంటంటే?

అభిమానులను గతకొన్ని నెలలుగా వెయిట్ చేయిస్తున్న 'హరి హర వీరమల్లు' మేకర్స్‌ పవన్ బర్త్‌డే రోజు ఈ సినిమాకు సంబంధించిన ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేయనున్నారట. ఇప్పటికే దీనికి సన్నాహాలు కూడా జరుగుతున్నాయని సమాచారం.

ఆ తర్వాత డైరక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' గురించి అప్‌డేట్ ఉంటుంది. ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకుని సినిమా షూటింగ్ మొదలుపెట్టే పనిలో పడింది మూవీ యూనిట్. ఇందులో భాగంగానే బర్త్‌డే రోజునే సినిమా షూటింగ్ స్టార్ట్ చేసే టైమ్‌ను అనౌన్స్ చేస్తారని సినీ వర్గాల టాక్. స్వతహాగా పవన్ కల్యాణ్ ఫ్యాన్ అయిన హరీశ్ ఇంకొంచెం ఎక్స్‌ట్రా ఫోకస్‌తో సినిమాకు పని చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

ఇవన్నీ ఓ ఎత్తు అయితే సుజిత్ డైరక్షన్‌లో రెడీ అవుతున్న 'OG' సినిమా అప్డేట్‌ మరో ఎత్తు. ఇప్పటికే ఈ మూవీ ప్రొడక్షన్ టీమ్ కూడా అభిమానులను తెగ వెయిట్ చేయిస్తున్న నేపథ్యంలో వీరి నుంచి ఓ సాలిడ్‌ అప్డేటే రానున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఓ క్రేజీ వీడియో అని సినీ వర్గాల టాక్. పవన్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ వీడియో ఆ రోజే రిలీజ్ చేసి అభిమానులకు కన్నుల పండుగ చేయాలనుకుంటున్నారట డైరెక్టర్ సుజిత్.

గతేడాది పవన్ పుట్టినరోజు( సెప్టెంబరు 2)న 'OG' నుంచి 'హంగ్రీ చీతా' అంటూ ఓ గ్లింప్స్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ గ్లింప్స్ ఫ్యాన్స్​కు పునకాలు తెప్పించింది. ఆ తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీ కావడం వల్ల షూటింగ్​కు బ్రేక్ పడి సినిమా నుంచి అప్డేట్స్ రాలేదు. అలాగే ఇంకా సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడం వల్ల వచ్చే ఏడాది ప్రారంభంలో మూవీ విడుదలయ్యే అవకాశం ఉంది.

పవన్​ అందుకే 'ఖుషి' సీక్వెల్ ఒప్పుకోలేదు - అసలు కారణం చెప్పిన ఎస్​ జే సూర్య - SJ SURYAH Kushi SEQUEL

'నాని, పవన్ కల్యాణ్ మధ్య ఉన్న పోలిక అదే!' : ప్రియాంక మోహన్‌ - Saripodhaa Sanivaaram Priyanka

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.