ETV Bharat / entertainment

ప్రభాస్​ 'కల్కి'లో మరో ఇద్దరు టాలీవుడ్ హీరోలు​ - స్క్రీన్​ను షేక్​ చేసే రోల్స్​లో! - కల్కి సినిమా ఎన్టీఆర్ నాని

Prabhas Kalki NTR Nani : ప్రభాస్ కల్కిలో గెస్ట్ రోల్స్​ లిస్ట్​ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. చిత్రంలో మరో ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా కనిపిస్తారని కొత్త ప్రచారం మొదలైంది. వారిద్దరి పాత్రల పేర్లు కూడా ఆ ప్రచారంలో వినిపిస్తోంది. ఆ వివరాలు.

ప్రభాస్​ 'కల్కి'లో మరో ఇద్దరు తెలుగు స్టార్స్​ - ఎవరంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 29, 2024, 8:14 PM IST

Prabhas Kalki NTR Nani : ప్రభాస్ హీరోగా దర్శకుడు​ నాగ్​ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ 'కల్కి 2898' ఏడి. భూత భవిష్యత్ కాలాల నేపథ్యంతో ఈ సినిమా కథ సాగనుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రంలో ఇప్పటికే ప్రభాస్​తో పాటు భారీ తారగాణం నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్స్​ బిగ్​ బీ అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొణె, దిశాపటానీ నటిస్తున్నారు. యూనివర్సల్ స్టార్​ కమల హాసన్ (విలన్ పాత్ర అని సమాచారం) కూడా సినిమాలో భాగమయ్యారు.

అయితే ఈ బిగ్ స్టార్స్​తో పాటు స్పెషల్​ క్యామియో రోల్స్​లో మలయాళ స్టార్​ దుల్కర్ సల్మాన్, టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండలు కూడా కనిపిస్తారని ఆ మధ్య లీక్​ పేరుతో గట్టిగా ప్రచారం సాగింది. దాదాపుగా ఈ ఇద్దరు కనిపించడం ఖాయమేనని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా ఇప్పుడు ఓ మైండ్​ బ్లోయింగ్ న్యూస్​ తెలిసింది. సినిమాలో గెస్ట్​ రోల్స్​ లిస్ట్​ మరింత పెరగనుందని అంటున్నారు.

క్లైమాక్స్​కు ముందు వచ్చే కీలక ఘట్టాల్లో నేచురల్ స్టార్ నానితో పాటు యంగ్ టైగర్​ జూనియర్ ఎన్టీఆర్ కూడా కనిపించబోతున్నారని కొత్త ప్రచారం మొదలైంది అని తెలిసింది. కృపాచార్యగా నాని, పరశురాముడిగా ఎన్టీఆర్​ సిల్వర్​ స్క్రీన్​పై అదరగొట్టే సన్నివేశాల్లో కనిపించనున్నారట. మరి ఇందులో నిజమెంతో తెలీదు కానీ ప్రస్తుతానికైతే ఈ వార్త నెట్టింట్లో చక్కర్లు కొట్టడం ప్రారంభమైంది. ఇవన్నీ తెలుసుకుంటున్న అభిమానులు నాగ్ అశ్విన్ అంచనాలకు మించి గట్టిగా ప్లాన్​ చేస్తున్నారని అంటున్నారు. చూడాలి మరి ఈ ఎక్స్​పెరిమెంట్​ సినిమా ఎలాంటి రిజల్ట్​ను అందుకుంటుందో..

ఇకపోతే సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్నారు. వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్​తో సినిమాను​ నిర్మిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఒకవైపు జరుపుకుంటూనే మరోవైపు బ్యాలన్స్ షూటింగ్​ను వేగంగా పూర్తి చేస్తున్నారు మేకర్స్​.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'శ్రీమంతుడు' కథపై వివాదం - కొరటాల శివకు సుప్రీంలో చుక్కెదురు

మెగాస్టార్ సరసన హనీరోజ్​​ - ఏ సినిమాలో అంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.