ETV Bharat / entertainment

ముందుగానే వచ్చేస్తున్న 'దేవర' - కొత్త రిలీజ్ డేట్​ వచ్చేసిందోచ్​ - Devara Release Date - DEVARA RELEASE DATE

Devara New Release Date Announced : వాయిదా పడిందంటూ ప్రచారం సాగుతున్న 'దేవర - పార్ట్‌ 1' కొత్త విడుదల తేదీని ప్రకటించారు. రెండు వారాలు ముందుకు జరిపి తీసుకొస్తున్నారు.

Source ETV Bharat
Devara New Release Date (Source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 13, 2024, 6:42 PM IST

Devara New Release Date Announced : దేవర దూసుకొస్తున్నాడు. రిలీజ్ డేట్​ వాయిదా పడి అక్టోబరు 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆగమేఘాల మీద అంతకన్నా ముందే రెడీ అవుతున్నాడు. తాజాగా ట్విట్టర్ వేదికగా చేసిన పోస్టులో సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నట్లు దేవర్ టీమ్ వెల్లడించింది. తొలి భాగాన్ని విడుదల చేయనున్నట్లు గురువారం అధికారికంగా ప్రకటించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే - కొరటాల శివ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఈ దేవర. "జనతా గ్యారేజ్" లాంటి హిట్ తర్వాత కొరటాల శివ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి. తొలి సారి జాన్వీ కపూర్ తెలుగు సినిమాకు పరిచయం కాబోతుండగా, సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనువిందు చేయనున్నారు. ముందుగా అనుకున్న డేట్ ప్రకారం ఈ సమ్మర్​లోనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఆ తర్వాత వాయిదా వేసుకున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని అక్టోబర్ 10 నాటికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు అనుకున్న దాని కన్నా ముందే సినిమా సిద్ధం కావడం వల్ల రెండు వారాల ముందే సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్లు కన్ఫమ్ చేశారు.

కాగా, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన వెట్టాయన్ చిత్రం అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. పైగా దేవరను తమిళ, కన్నడ భాషల్లోనూ రిలీజ్ చేయాలనుకున్నారు. దీంతో దేవర, వెట్టాయన్ పోటీ తప్పదనుకున్నారు. అయితే ఈ రెండు చిత్రాలకు పోటీ ఉండకూడదనే ఉద్దేశ్యంతో దేవర రిలీజ్ డేట్‌ను ముందుకు జరిపినట్లు ప్రచారం సాగుతోంది.

ఇకపోతే ఇప్పటికే దేవర నుంచి రిలీజ్ అయిన ఫియర్ సాంగ్ సూపర్ సక్సెస్ సాధించింది. అనిరుధ్ కంపోజింగ్‌లో మరో పాట రిలీజ్​కు రెడీ అవుతోంది. అభిమానుల కోసం రెండో పాటగా మెలోడి సాంగ్‌ను విడుదల చేయాలనుకుంటున్నారట. తీర ప్రాంత నేపథ్యంతో నడిచే ఈ కథను గ్రాండ్ స్కేల్‌లో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కొరటాల శివ. జాన్వీ, సైఫ్‌లతో పాటు శృతి మరాఠే, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, అజయ్, షైన్ టామ్ చాకో, నరైన్ కుమార్​లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా దేవర చిత్రాన్ని నిర్మిస్తున్నారు.మరోవైపు పవన్ కల్యాణ్ నటిస్తున్న 'ఓజీ' కూడా సెప్టెంబర్ 27నే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ, ఇంకా చిత్రీకరణ మిగిలి ఉండటం, ఇప్పుడు దేవర ప్రకటన వల్ల రిలీజ్ డేట్ మారుస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

కమల్ 'థగ్ లైఫ్' షూట్ - ఆ స్టార్ యాక్టర్​కు బోన్​ ఫ్రాక్చర్​!

ఇండస్ట్రీలో విషాదం - ప్రముఖ నటుడు అనుమానాస్పద మృతి - Actor pradeep k vijayan Died

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.