ETV Bharat / entertainment

'స్వయంభు' సాలిడ్ అప్డేట్ - వరల్డ్ బెస్ట్ ఫిల్మ్​మేకర్​తో భారీ యాక్షన్ సీక్వెన్స్​! - Nikhil Swayambhu

author img

By ETV Bharat Telugu Team

Published : May 7, 2024, 1:48 PM IST

Nikhil Swayambhu : నిఖిల్ హీరోగా భారీ బడ్జెట్​తో తెరకెక్కుతున్న స్వయంభు మూవీ గురించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. అదేంటంటే?

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

Nikhil Swayambhu : టాలీవుడ్​లో విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ సరికొత్త కథలతో ఆడియెన్స్ ముందుకు వస్తుంటారు నిఖిల్. కార్తికేయ 2 పాన్ ఇండియా హిట్ తర్వాత ఆయన మార్కెట్ కూడా పెరిగింది. అప్పటివరకు తన మార్కెట్ స్థాయి బడ్జెట్ మూవీస్​తో ప్రేక్షకులను పలకరించిన నిఖిల్​ ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే దర్శకుడు భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్వయంభు చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని గ్రాండ్​గా తెరకెక్కిస్తున్నారు. నిఖిల్ కూడా అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు.

అయితే తాజాగా నిఖిల్ తన సోషల్ మీడియాలో ఈ మూవీ గురించి స్పెషల్ బిగ్ స్క్రీన్ ట్రీట్ అంటూ లేటెస్ట్ అప్డేట్ పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన భారీ యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని సర్ప్రైజ్స్ ఉన్నాయని ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నీషియన్స్, ఫిల్మ్ మేకర్ దీని కోసం పనిచేయబోతున్నారని హింట్ ఇచ్చారు. అంతేకాదు ఈ పోస్ట్​తో పాటు మూవీ పోస్టర్​ను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం తెరకెక్కుతున్న ఈ యాక్షన్ సిక్వెన్స్​కు రూ.8 కోట్లు ఖర్చు పెడుతున్నారని ఇండస్ట్రీలో టాక్.

ఇది నిఖిల్​కు 20వ చిత్రం. గత ఏడాది ఆగస్ట్​లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీ నిఖిల్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా. ఇందులో నటిస్తున్న నటీనటుల అందరి ఫస్ట్ లుక్ పోస్టర్లను మూవీ యూనిట్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ ఈ మూవీపై క్రేజ్ పెంచే ప్రయత్నం చేస్తోంది.

Swayambhu Cast and Crew : ఇక ఈ సినిమాలో నిఖిల్​కు జోడిగా సంయుక్త మేనన్, నభా నటేశ్ హీరోయిన్స్​గా నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు భారీ బడ్జెట్​తో తెరకెక్కిస్తున్నారు. దీనిని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో భారీ స్థాయిలో విడుదల చేయాలని నిర్ణయించారు

ఆర్య ప్రేమ కథకు 20ఏళ్లు - ఆ ఆరుగురు జీవితాల్ని మార్చేసింది! - Arya movie 20 years

బన్నీ లైఫ్​ను మార్చేసిన ఆ తేదీ - అసలా రోజు ఏం జరిగిందంటే? - ALLUARJUN

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.