Nani SJ Suryah Saripoda Sanivaram First Day Boxoffice Collections : నాని, ఎస్ జే సూర్య కలిసి నటించిన 'సరిపోదా శనివారం' సినిమాకు ప్రీమియర్ షోస్ నుంచే మంచి టాక్ దక్కింది. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్‌ను అందుకుంటోంది. అటు అమెరికాతో పాటు ఇటు ఇండియాలోనూ నాని ఫ్యాన్స్, ఆడియెన్స్ సినిమా బాగుందని రివ్యూలు ఇస్తున్నారు. హీరో నానితో పాటు మరీ ముఖ్యంగా విలన్‌గా నటించిన ఎస్ జె సూర్య నటనకు ఫిదా అయిపోతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలో 'సరిపోదా శనివారం' సినిమాకు మంచి టాక్ దక్కింది. సినిమా హిట్ అంటూ రివ్యూలు చక్కర్లు కొడుతున్నాయి. మార్నింగ్ షోస్ కన్నా నైట్ షోస్ కలెక్షన్స్ బాగా వచ్చాయి. మొత్తంగా ఇండియాలో మొదటి రోజు రూ. 8.5 కోట్ల వసూళ్లు వచ్చాయి.
మొదటి రోజు ఏపీ, నైజాంలో రూ. 6.50 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయట. తెలుగు రాష్ట్రాల తర్వాత కన్నడలో ఈ చిత్రానికి ఎక్కువ వసూళ్లు వచ్చాయి. అక్కడ రూ. కోటి రూపాయల వరకు వచ్చింది. తమిళనాడులోనూ సినిమాను భారీగానే విడుదల చేశారు. ఎస్ జే సూర్య విలన్ రోల్ చేయడంతో అక్కడ సినిమాకు హైప్ కనిపించింది. కానీ కలెక్షన్స్ వచ్చింది కేవలం రూ. 63 లక్షల రూపాయలు మాత్రమే. నార్త్ ఇండియా రూ. 7 లక్షల వరకు వచ్చాయట.
ఓవర్సీస్ మార్కెట్ - అమెరికాలో నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సినిమాగా 'సరిపోదా శనివారం' నిలిచింది. మిడ్ వీక్ రిలీజ్ అయినప్పటికీ అక్కడ మొదటి రోజు 2,71,110 డాలర్లు వచ్చాయట. అంటే దాదాపు 300కె డాలర్స్. వీకెండ్ ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా, ఈ కలెక్షన్స్ వివరాలన్నీ అఫీషియల్ కాదు. సోషల్ మీడియా, ఇతర ఎంటర్టైన్మెంట్ వెబ్ సైట్ల ఆధారంగా రాసినవి.
ఇకపోతే సరిపోదా శనివారం చిత్రంలో ప్రియాంక మోహన్ కథానాయికగా నటించింది. అభిరామి, సాయి కుమార్ హీరో తల్లిదండ్రుల పాత్రల్లో కనిపించారు. మురళీ శర్మ, అజయ్, హర్షవర్ధన్, 'శుభలేఖ' సుధాకర్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఇక జేక్స్ బిజాయ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.
సారీ, నేను ఆ మాట ఇవ్వలేను! : ఫ్యాన్స్‌తో హీరో నాని - Nani Saripoda Sanivaram Movie
నాని యాక్షన్ థ్రిల్లర్ - 'సరిపోదా శనివారం' ఎలా ఉందంటే ? - Saripodhaa Sanivaaram Movie Review