ETV Bharat / entertainment

నాని మాస్ వార్నింగ్ - 'సరిపోదా శనివారం' ట్రైలర్ చూశారా? - Nani Saripodhaa Sanivaaram Trailer - NANI SARIPODHAA SANIVAARAM TRAILER

Nani Saripodhaa Sanivaaram Trailer : నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న 'సరిపోదా శనివారం' నుంచి మేకర్స్ ఓ సాలిడ్ ట్రైలర్​ను విడుదల చేశారు. మరీ ఆ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.

Nani Saripodhaa Sanivaaram Trailer
Nani Saripodhaa Sanivaaram Trailer (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 13, 2024, 8:36 PM IST

Updated : Aug 13, 2024, 8:48 PM IST

Nani Saripodhaa Sanivaaram Trailer : నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న 'సరిపోదా శనివారం' నుంచి మేకర్స్ ఓ సాలిడ్ ట్రైలర్​ను విడుదల చేశారు. ఫుల్​ ఆన్ యాక్షన్ ఎలిమెంట్స్​తో ఉన్న ఆ వీడియో ప్రస్తుతం నాని ఫ్యాన్స్​తో పాటు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. నటుడు సాయి కుమార్ హీరోకు ఇచ్చిన ఎలివేషన్స్​ ఆ వీడియోకు హైలైట్​గా నిలిచింది.

ట్రైలర్​లో ఏముందంటే?
ఈ సినిమా రెండు మెయిన్ క్యారెక్టర్స్​ చుట్టూ తిరగనున్నట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. సీఐ దయానంద్ ( ఎస్​జే సూర్య) ఇతరలను విచక్షణ రహితంగా హింసించే ఓ క్రూరమైన వ్యక్తి. తన పవర్​ను అడ్డం పెట్టుకుని అమాయకులను కొడుతుంటాడు. దీంతో సోకులపాలెం అనే ఊరి జనాలు చాలా కష్టాలు పడుతుంటారు. ఇక మిడిల్ క్లాస్​ లైఫ్​ను గడిపే సూర్య చూసేందుకు సింపుల్​గా కనిపిస్తూనే శనివారం మాత్రం యాంగ్రీ మ్యాన్​గా మారిపోతుంటాడు. తన చుట్టూ ఉన్నవారికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోడు సహించలేడు. అలా ఇతరులకు ఇబ్బంది పెట్టే వారి పేర్లను రాసుకుని శనివారం రోజు వారిపై కోపం తీర్చుకుంటాడు. అయితే ఒకానొక సమయంలో సీఐ దయానంద్ పేరును తన వద్దనున్న డైరీలో రాసుకున్న విషయాన్ని సూర్య (నాని) తండ్రి చూసి ఆందోళన చెందుతాడు. అయితే హీరో అతడి పేరు ఎందుకు రాసుకున్నాడు? వారిద్దరి మధ్య ఎటువంటి రైవలరీ ఉందన్న విషయం తెలుసుకోవాలంటే సినిమా కోసం వెయిట్ చేయాల్సిందే అన్నట్లుగా ట్రైలర్​ను కట్​ చేశారు మేకర్స్. ఇక నాని, ఎస్​జే సూర్యతో పాటు ప్రియాంక అరుల్ మోహన్​, శుభలేఖ సుధాకర్​, హర్షవర్ధన్​, సాయి కుమార్​ లాంటి స్టార్స్ ఈ ట్రైలర్​లో తమ తమ పాత్రలను పరిచయం చేసుకుని సినిమాపై మరింత ఇంట్రెస్ట్ పెంచారు.

'ఈ సినిమాలో అలాంటివేమీ ఉండవు'
వాస్తవానికి 'సరిపోదా శనివారం' టైటిల్ లాంచ్ అయినప్పటి నుంచీ ఇది శివకార్తికేయన్ నటించిన "మావీరన్" చిత్రం తరహాలో సూపర్ హీరో మూవీలా ఉంటుందనే పుకార్లు వచ్చాయి. ఇందులో నాని పక్కింటి అబ్బాయిలా కాకుండా ఓ సూపర్ హీరో పాత్రలో కనిపిస్తాడని చాలా మంది భావించారు. కానీ టీజర్, పాటలు చూస్తే అలా అనిపించలేదు. అయినప్పటికీ కొందరు ఈ పుకార్లను నమ్ముతూనే వచ్చారు. కాగా ఈ రూమర్స్ అన్నింటినీ తాజాగా కొట్టిపాడేసింది చిత్రయూనిట్. 'సరిపోదా శనివారం' సినిమాలో ఎలాంటి ఫాంటసీ ఎలిమెట్స్ ఉండవనీ, ఇది కేవలం నాని ఎస్​జే సూర్యల మధ్య జరిగే పరిస్థితుల చుట్టూ తిరుగుతుందనీ చెప్పేసింది ప్రోడక్షన్ టీమ్​.

కొత్త అవతారం ఎత్తిన హీరో నాని - హిట్ 3 కోసం అలా!

'గరం గరం'గా సరిపోదా శనివారం ఫస్ట్ సింగిల్​ - విన్నారా? - Saripodhaa Sanivaaram First Single

Last Updated : Aug 13, 2024, 8:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.