ETV Bharat / entertainment

'కల్కి' విజయ్​ దేవరకొండ, దుల్కర్​ ర్యాంపేజ్​ - ఈ హైలైట్​ సీన్స్​ చూశారా? - Kalki 2898 AD Movie - KALKI 2898 AD MOVIE

Kalki 2898 AD Vijay Devarkonda Dulquer Salman : కల్కి 2898ఏడీలో ప్రభాస్, అమితాబ్​ బచ్చన్​తో పాటు దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ పాత్రలు అదిరిపోయాయంటూ సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్​, దుల్కర్​కు సంబంధించిన సన్నివేశాలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇంతకీ వారు ఏ పాత్రల్లో నటించారంటే?

source ETV Bharat and ANI
kalki 2898 AD (source ETV Bharat and ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 27, 2024, 9:24 AM IST

Kalki 2898 AD Vijay Devarkonda Dulquer Salman : 'కల్కి 2898 ఏడీ' సినిమా థియేటర్లలో రిలీజై బ్లాక్ బస్టర్​ టాక్​తో దూసుకుపోతోంది. యూఎస్​ఏ ప్రీమియర్స్​, తొలి షో నుంచే పాజిటివ్ టాక్​ దక్కించుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్​ను షేక్ చేసేలా కనిపిస్తోంది. ముఖ్యంగా సంగీతం ప్రాణం పోసిందంటూ చెబుతున్నారు. అలాగే ప్రతిఒక్కరి నటన అద్భుతంగా ఉందంటూ ఆడియెన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్​, అమితాబ్​ యాక్షన్ సీక్వెన్స్​లు అదిరిపోయాయంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరు హీరోలతో పాటు మరీ ముఖ్యంగా విజయ్​ దేవరకొండ గురించి కూడా తెగ చర్చించుకుంటున్నారు. ఆయనకు సంబంధించిన వీడియోలను తెగ షేర్ చేస్తున్నారు.

వాస్తవానికి మొదట నుంచి ఈ చిత్రంలో గెస్ట్ రోల్స్​ చాలానే ఉన్నాయని ప్రచారం సాగింది. వారిలో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, దర్శకధీరుడు రాజమౌళి పేర్లు కూాడా వినిపించాయి. ప్రచారం సాగినట్టుగానే వీరంతా సినిమాలో ఆయా పాత్రల్లో తళుకున్న మెరిశారు. అలానే సినిమా రిలీజ్​కు కొన్ని గంటల ముందు విజయ్​, దుల్కర్ ఉన్నట్టు దర్శకుడు నాగ్ అశ్విన్​ కూడా స్పష్టం చేశారు.

అయితే తాజాగా సినిమా రిలీజైన తర్వాత విజయ్​ దేవరకొండ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నారు. సినిమాలో ఆయనకు సంబంధించిన సీన్స్​​ తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఆయన అర్జునుడిగా కనిపించారు. అశ్వత్థామపై(అమితాబ్​) యుద్ధం చేస్తున్న సమయంలో సంభాషణ చెబుతూ కనిపించారు. ఇది చూసిన సినీ ప్రియులు విజయ్ దేవరకొండ లుక్, డైలాగ్ డెలివరీ అదిరిపోయిందని అందరూ తెగ ప్రశంసిస్తున్నారు.

ఇకపోతే చిన్నప్పుడు ప్రభాస్​ను కాపాడి పెంచిన ఓ యోధుడిలా దుల్కర్ సల్మాన్ కనిపించారు. ఇది చూసిన అభిమానులు దుల్కర్ పాత్ర అదిరిపోయిందంటూ సోషల్ మీడియాలో తెగ రివ్యూలు వస్తున్నాయి. ఇక రాజమౌళి, రామ్ గోపాల్​వర్మ పాత్రలు తళుక్కున్న మెరిసి పర్వాలేదనిపించాయట. ఇంకా ఈ చిత్రంలో దీపికా పదుకొణె, దిశా పటానీ, మాళవికా నాయర్ సహా పలువురు నటించారు. నాగ్ అశ్విన్​ దర్శకత్వం వహించారు. వైజయంతీ మూవీస్​ దాదాపు రూ.600కోట్లతో నిర్మించింది.

'కల్కి' ఓటీటీ డీటెయిల్స్​ ఇవే​ - డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే? - Kalki 2898 AD OTT Rights

'కల్కి' ట్విటర్ రివ్యూ - సినిమా టాక్ ఎలా ఉందంటే? - Kalki 2898 AD Movie Review

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.