ETV Bharat / entertainment

'ఆ ముగ్గురి మధ్య భీకర పోరాటం - అసలు కథ మొదలయ్యేది అప్పుడే' - Kalki 2898 AD - KALKI 2898 AD

Nag Ashwin Kalki 2 : 'కల్కి' సినిమా సీక్వెల్​ గురించి ఆ మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. అసలు కథ మొదలయ్యేది పార్ట్‌ 2లోనే అని పేర్కొన్నారు. ఇంకా ఏమన్నారంటే?

Nag Ashwin Kalki 2
Nag Ashwin (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 5, 2024, 9:26 AM IST

Nag Ashwin Kalki 2 : థియేటర్లలో, నెట్టింట ఇలా ఎక్కడ చూసినా 'కల్కి' హవా నడుస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌ కాంబోలో వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించి దూసుకెళ్తోంది.

అయితే తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌ వస్తోందని మేకర్స్ కన్ఫార్మ్ చేశారు. ఇప్పటికే నిర్మాత అశ్వినీదత్​కూడా ఈ విషయం గురించి పలు సందర్భాల్లో మాట్లాడారు. ఈ నేప తాజాగా మొదటిసారి నాగ్ అశ్విన్‌ కూడా ఈ సీక్వెల్‌పై స్పందించారు. అసలు కథ మొదలయ్యేది పార్ట్‌ 2లోనే అంటూ పేర్కొన్నారు.

"సీక్వెల్‌కు సంబంధించి సుమారు నెలరోజుల పాటు షూటింగ్‌ చేశాం. అందులో 20 శాతం బెస్ట్‌గా వచ్చింది. ఇంకా పలు ముఖ్యమైన యాక్షన్‌ సీన్స్ షూట్ చేయాల్సి ఉంది. వాటిని కొత్తగా ప్రారంభించాలి. ఈ సీక్వెల్‌లోప్రభాస్‌ , కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్​ మధ్య భారీ యాక్షన్ సీన్స్ ఉండనున్నాయి. అశ్వత్థామ, కర్ణుడు, యాస్కిన్‌ల మధ్య శక్తిమంతమైన ధనుస్సు కీలకం కానుంది" అని అన్నారు.ఇక ఈ సినిమాకు ప్రేక్షకుల్లో వస్తోన్న ఆదరణపై నాగీ సంతోషం వ్యక్తం చేశారు.

"ప్రేక్షకులు దీన్ని ఎంతగానో ఎంజాయ్‌ చేస్తున్నారు. ఎంతోమంది ఆడియన్స్‌ ఒకసారి కంటే ఎక్కువసార్లు ఈ సినిమాను చూస్తున్నట్లు తెలిసింది. మూవీ సక్సెస్​ సాధించిందని చెప్పడానికి అదే సంకేతం" అంటూ ఆడియెన్స్​ను థ్యాంక్స్ చెప్పారు.

భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ మూవీ కలెక్షన్లలోనూ పలు రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఇప్పటి వరకు రూ.700 కోట్లకు పైగా వసూళ్లు చేసినట్లు తాజాగా మూవీ టీమ్ ప్రకటించింది. దీంతో త్వరలోనే ఈ సైన్స్‌ ఫిక్షన్‌ రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌, మాళవిక నాయర్, మృణాల్ ఠాకూర్, రాజమౌళి​ లాంటి స్టార్స్ అతిథి పాత్రలతో అలరించారు. బౌంటీ ఫైటర్‌ భైరవగా సందడి చేసిన ప్రభాస్‌, చివరిలో కర్ణుడిగా కనిపించి పార్ట్‌ 2పై మరిన్ని అంచనాలు పెంచేశారు. దీపికా పదుకుణె, దిశా పటానీ పశుపతి, రాజేంద్ర ప్రసాద్, శోభన, బ్రహ్మానందం, అన్నా బెన్​ తదితరులు కూడా తమ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు.

'కల్కి' కాన్సెప్ట్‌తో తెరకెక్కిన టాప్ 7 మూవీస్ - అన్నీ అక్కడివే! - Kalki 2898 AD

'కల్కి' ఫస్ట్ వీక్​ బాక్సాఫీస్ కలెక్షన్స్​ - ఆ రెండు సినిమాల రికార్డులు బ్రేక్​ - Kalki 2898AD First Week Collections

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.