ETV Bharat / entertainment

ఓటీటీలోకి సంక్రాంతి బ్లాక్​బస్టర్​ - 'నా సామి రంగ' స్ట్రీమింగ్ ఎప్పుడంటే ? - నా సామి రంగ ఓటీటీ రిలీజ్

Naa Saami Ranga Movie OTT Release : నాగార్జున, ఆషికా రంగనాథ్​ లీడ్​ రోల్స్​లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'నా సామి రంగ'. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్​ డేట్​ను మేకర్స్ అనౌన్స్​ చేశారు. ఇంతకీ ఈ సినిమా ఎక్కడ స్ట్రీమ్​ కానుందంటే ?

Naa Saami Ranga Movie OTT
Naa Saami Ranga Movie OTT
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 10, 2024, 3:44 PM IST

Naa Saami Ranga Movie OTT Release : సంక్రాంతి బరిలో సందడి చేసేందుకు దిగిన సినిమాల్లో 'నా సామి రంగ ఒకటి'. నాగార్జున, రాజ్ తరుణ్​, అల్లరి నరేశ్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో పాటు టాక్​ను కూడా అందుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీగా ఉంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా ఫిబ్రవరి 17 నుంచి స్ట్రీమ్​ కానున్నట్లు హాట్​స్టార్ అఫీషియల్ అనౌన్స్​మెంట్​ చేసింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్​తో పాటు మూవీ లవర్స్​ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో నాగ్​ సరసన కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ నటించింది. విజయ్‌ బిన్ని ఈ సినిమాకు డైరెక్టర్​గా వ్యవహరించారు. ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో మిర్నా మేనన్, రుక్సర్‌ థిల్లాన్, నాజర్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

స్టోరీ ఏంటంటే :
కిష్టయ్య (నాగార్జున) ఓ అనాథ. అంజి (అల్లరి నరేశ్‌) తల్లి అతడ్ని చేరదీస్తుంది. అప్పటి నుంచి వారిద్దరూ సొంత అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉంటారు. తల్లి మృతిచెందిన తర్వాత పిల్లలిద్దరికీ ఆ ఊరి ప్రెసిడెంట్‌ పెద్దయ్య (నాజర్‌) అండగా నిలబడతాడు. అయితే కిష్టయ్య 12 ఏళ్ల వయసులోనే వరాలు (ఆషికా రంగనాథ్‌)తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతడ్ని ప్రేమిస్తుంది. చదువుల కోసం పట్టణానికి వెళ్లిపోయిన వరాలు, 15 ఏళ్లకు తిరిగి వస్తుంది. దీంతో వీరిద్దరి లవ్​ స్టోరీ మళ్లీ మొదలవుతుంది. ఇక తన ప్రేమ విషయాన్ని పెద్దయ్యకు చెప్పేందుకు వరాలును తీసుకొని కిష్టయ్య ఇంటికి వెళ్తాడు.

అప్పుడే ఆమె తండ్రి వరదరాజులు (రావు రమేశ్‌) తన కూతుర్ని పెద్దయ్య కుమారుడు దాసు (షబ్బీర్‌)కు ఇచ్చి వివాహం జరిపించాలని సంబంధం కుదుర్చుకోవడానికి వస్తాడు. అయితే వీళ్ల ప్రేమను అర్థం చేసుకొని పెద్దయ్య ఆ సంబంధాన్ని వదులుకుంటాడు. కానీ, తన కూతుర్ని కిష్టయ్యకు ఇచ్చి పెళ్లి చేయడానికి వరదరాజులు ససేమిరా అంటాడు. మరి ఆ తర్వాత ఏమైంది? వీరి ప్రేమ పెళ్లి పీటలెక్కిందా? అంజిపై దాసు పగ పెంచుకోవడానికి కారణమేంటి? ఈ కథలో భాస్కర్‌ (రాజ్‌తరుణ్‌) - కుమారి (రుక్సార్‌)ల ప్రేమ వల్ల ఏర్పడ్డ సంఘర్షణ ఏంటి? అన్నది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'నా సామి రంగ' ఫస్ట్ డే కలెక్షన్స్​ - ఊహించిన దాని కన్నా ఎక్కువగా!

'నా సామి రంగ' రివ్యూ : నాగార్జున మాస్‌ జాతర ఎలా ఉందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.