ETV Bharat / entertainment

మహేశ్ ఫ్యాన్స్​పై కృష్ణవంశీ అసహనం - అలా చేయొద్దంటూ రిక్వెస్ట్ - MURARI MOVIE RE RELEASE

Mahesh Babu Murari Re Release : 'మురారి' రీరిలీజ్​ సమయంలో యువతి యువకులు థియేటర్లలో పెళ్లి చేసుకోవడంపై డైరెక్టర్ కృష్ణవంశీ స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే?

Murari Re Release
Murari Re Release (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 11, 2024, 1:06 PM IST

Mahesh Babu Murari Re Release : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్​ బాబు లీడ్​ రోల్​లో తెరకెక్కిన 'మురారీ' మూవీ రీరిలీజ్​లోనూ పలు సెన్సేషన్స్ సృష్టిస్తోంది. మహేశ్​ బర్త్​డే సందర్భంగా ఆగస్టు 9న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్​ వద్ద భారీగా వసూళ్లు సాధించింది. తమ అభిమాన స్టార్​ బర్త్​డేను సెలబ్రేట్ చేసుకునేందుకు ఫ్యాన్స్ కూడా థియేటర్లకు బారులుతీరి సందడి చేశారు.

ముఖ్యంగా ఇందులోని 'అలనాటి రామచంద్రుడు' పాటకు థియేటర్లలో మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో ఆ పాట ప్లే అవుతున్న సమయంలో పలు థియేటర్లలో యువతీయువకులు పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు నెట్టింట ట్రెండ్ అవ్వగా, అవి కాస్త డైరెక్టర్ కృష్ణవంశీ కంట పడ్డాయి. ఇక ఈ విషయంపై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

"మన సంస్కృతి, సంప్రదాయాలను అపహాస్యం చేయొద్దు. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఇటువంటి పనులు చేయకండి" అంటూ పోస్ట్‌ చేశారు. అయితే తెలిసీ తెలియక వాళ్లందరూ అలా చేసి ఉండొచ్చని, వారికి మంచి భవిష్యత్తు ఉండాలని ఆయన కోరుకుంటున్నట్లు తెలిపారు.

కుటుంబ కథా చిత్రంగా రూపొందిన 'మురారి' సినిమాలో మహేశ్‌బాబు, సోనాలీ బింద్రేతో పాటు కైకాల సత్యనారయణ, లక్ష్మీ, గొల్లపుడి మారుతిరావు లాంటి సీనియర్ స్టార్స్ నటించి ప్రేక్షకులను అలరించారు. 2001లో వచ్చిన ఈ మూవీ అప్పట్లోనే పలు థియేటర్లలో 100 రోజులు ఆడి రికార్డుకెక్కింది. ఇందులోని సాంగ్స్​ కూడా చాలా పాపులరయ్యాయి.

రీరిలీజ్​లోనూ రికార్డులే
మరోవైపు, రీ రిలీజ్‌లోనూ 'మురారి' సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిందని సినీ విశ్లేషకుల మాట. దాదాపు రూ.5 కోట్ల వరకూ ఈ చిత్రం వసూలు చేసినట్లు సమాచారం. ఇక ఈ చిత్రానికి ఇంతటి విశేష ఆదరణ చూపినందుకు డైరెక్టర్ కృష్ణవంశీ ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు. "మరోసారి 'మురారి'ని ఇంతలా ఆదరించినందుకు థ్యాంక్స్. ఈ సినిమా కోసం పనిచేసిన నటీనటులు, ముఖ్యంగా హీరో మహేశ్‌ ఇంకా ఆయన అభిమానులతో పాటు మూవీటీమ్​కి పేరుపేరునా కృతజ్ఞతలు" అంటూ కృష్ణవంశీ పేర్కొన్నారు.

అందుకే 'మురారి' అనే టైటిల్‌..!

'మురారి' శాపం వెనక స్టోరీ ఇదే! - మీకు తెలుసా? - Murari Movie Re Release

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.