ETV Bharat / entertainment

'మిస్టర్ బచ్చన్', 'డబుల్ ఇస్మార్ట్'- తొలి రోజు వసూళ్లు ఎంతంటే? - Mr Bachchan Double Ismart

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 16, 2024, 7:29 AM IST

Mr Bachchan Double Ismart Day 1 Collection: మాస్ మహారాజ రవితేజ, ఉస్తాద్ రామ్ పోతినేని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తమతమ కొత్త చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి తొలిరోజు ఎవరెవరు ఎంతెంత సాధించారంటే?

MR BACHCHAN DOUBLE ISMART
MR BACHCHAN DOUBLE ISMART (Source: ETVBharat)

Mr Bachchan Double Ismart Day 1 Collection: మాస్ మహారాజ రవితేజ, ఉస్తాద్ రామ్ పోతినేని గురువారం తమతమ లేటెస్ట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హాలీడే రోజున ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో ఈ ఇద్దరు హీరోలు సక్సెస్ అయ్యారు. తొలి రోజు ఈ రెండు చిత్రాలు దాదాపు 70శాతం ఆక్యుపెన్సీతో రన్ అయ్యాయి. మరి ఇందులో ఎవరి సినిమా ఎంత వసూల్ చేసింది? తెలుసుకుందాం

Mr Bachchan Day 1 Collection: రవితేజ హీరోగా యంగ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కించిన 'మిస్టర్ బచ్చన్' బుధవారం సాయంత్రం నుంచే థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ క్రమంలో మూవీ డిసెంట్ కలెక్షన్లే వసూల్ చేసింది. తొలి రోజు ఈ సినిమా దేశవ్యాప్తంగా (ప్రీమియర్స్ కలిపి) రూ.5.3కోట్ల నెట్​ కలెక్షన్ చెసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక రవితేజ- హరీశ్ శంకర్ కాంబోలో తెరకెక్కిన మూడో సినిమా ఇది. అయితే ఈ సినిమాకు మిక్స్​డ్ టాక్ వినిపిస్తోంది. నటన పరంగా రవితేజ అదరగొట్టారు. హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే డ్యాన్స్, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్​పై విశ్వప్రసాద్ ఈ సినిమా నిర్మించారు.

Double Ismart Day 1 Collection: స్టార్ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన 'డబుల్ ఇస్మార్ట్' బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. ఈ సినిమా డే 1 కలెక్షన్లలో జోరు ప్రదర్శించింది. అత్యధికంగా ఈ చిత్రం మ్యాట్నీ షో 73.29శాతం ఆక్యుపెన్సీతో రన్ అయ్యింది. దీంతో ఈ సినిమా తొలి రోజు దేశవ్యాప్తంగా రూ.7.5కోట్లు నెట్ సాధించినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. భారీ అంచనాల మధ్య రిలీజైన 'డబుల్ ఇస్మార్ట్'​కు కలెక్షన్లు డీసెంట్​గానే వచ్చాయి. హీరో రామ్ తన​ మాస్ యాక్టింగ్​తో ఇరగదీశారు. కావ్యా థాపర్ హీరోయిన్​గా నటించింది. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించారు. పూరి కనెక్ట్స్​ బ్యానర్​పై చార్మి నిర్మించిన ఈ సినిమాకు, మణిశర్మ సంగీతం అందించారు.

రివ్యూ: రామ్, పూరి ఖాతాలో హిట్ పడిందా?- డబుల్ సిమ్ కార్డ్​ ఎలా పని చేసిందంటే? - Double Ismart Review

'మిస్టర్‌ బచ్చన్‌' రివ్యూ: రవితేజ మాస్ యాక్షన్ మూవీ ఎలా ఉందంటే? - Mr Bachchan Review

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.