Most Flops Hero : టాలీవుడ్, బాలీవుడ్‌లలో ఇప్పటి తరం హీరోలెవరూ కెరీర్ మొత్తం కష్టపడి పని చేసినా 50 సినిమాలు చేయడం అసాధ్యం! అయితే పాత సీనియర్ హీరోలు తమ కెరీర్లో 100 నుంచి 300,400 వరకు సినిమాలు చేసేవారు. అలానే వారికి అదే స్థాయిలో ఫ్లాప్‌లు కూడా ఉండేవి. అలా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ ఫ్లాప్‌లు అందుకున్న సూపర్ స్టార్ హీరో ఎవరో మీకు తెలుసా?, దాని గురించే ఈ కథనం. కొన్ని ఇంగ్లీష్ ఎంటర్టైన్మెంట్ మీడియా కథనాల ప్రకారం ఈ సమాచారం మీకు అందిస్తున్నాం.
ఇంతకీ ఆయన ఎవరంటే? - మిథున్ చక్రవర్తి ఈ పేరు చెబితే టక్కున గుర్తు పట్టకపోవచ్చు కానీ, ఐ యామ్ ఏ డిస్కో డ్యాన్సర్ సాంగ్ అనగానే సినీ ప్రియులంతా దాదాపుగా గుర్తు పట్టేస్తారు. ఈయన గత కొన్ని దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు. 1982లో వచ్చిన డిస్కో డ్యాన్సర్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన బెంగాలీ, హిందీ, ఒడిశా, భోజ్‌పురి, తమిళ్, కన్నడ, పంజాబీలో దాదాపు 350 సినిమాల వరకు నటించారు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈయన సుపరిచతమే. 'గోపాల గోపాల' చిత్రంలో స్వామీజీగా నటించి మెప్పించారు.
Mithun Chakraborty Flop Movies : అయితే ఈయన కెరీర్లో దాదాపు 180 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరిగ్గా ఆడలేదట. ఇందులో 133 ఫ్లాపులు, 47 డిజాస్టర్లు ఉన్నాయట. ఈయన డజన్ల కొద్దీ బీ గ్రేడ్ యాక్షన్ సినిమాలు కూడా చేశారట. 2000 ప్రారంభంలో వరుసగా 33 ఫ్లాపులు అందుకున్న రికార్డ్ ఈయన పేరే మీదే ఉందట! ఆ తర్వాత 2007లో బాక్సాఫీసు వద్ద వచ్చిన గురు పెద్ద హిట్ అయింది. దీంతో మిథున్ చక్రవర్తి ఫ్లాపులకు బ్రేక్ పడింది.
ఇన్ని ఫ్లాపులున్నప్పటికీ ఇంకా మిథున్ చక్రవర్తి స్టార్‌గా ఎందుకు ఉన్నారో తెలుసా? 80వ దశకంలో ఆయన చేసిన ప్రతి సినిమా పైసా వసూలేనట. అంతేకాదు ఆయన తొలి సినిమా 'మృగాయా'తోనే నేషనల్ అవార్డు అందుకున్నారు. ఇంకా డిస్కో డ్యాన్సర్ లాంటి చిత్రంతో పాటు 60 హిట్ మూవీస్ కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి. ఇంకా కొన్ని మల్టీ స్టారర్ మూవీస్‌తోనూ ఆయన సక్సెస్‌లను అందుకున్నారు. ప్రత్యేకించి ఈయన డ్యాన్స్ మూవ్స్ బాలీవుడ్ మొత్తాన్ని ఊపేశాయి. అందుకే డ్యాన్సింగ్ స్టార్స్‌లో ఈయన పేరు ముందుంటుంది.
మిథున్‌తో పాటుగా చాలా ఫ్లాపులు ఎదుర్కొన్న ఇతర హీరోలు కూడా ఉన్నారు. జితేంద్ర 106, ధర్మేంద్ర 99 ఫ్లాపులు, గోవిందా 75 ఫ్లాపులు, సంజయ్ దత్ 70 ఫ్లాపులు, అనిల్ కపూర్ 55 ఫ్లాపులు అందుకున్నారట.
'మత్తు వదలరా 2' రివ్యూ - ఈ క్రైమ్, కామెడీ OTTలోకి ఎప్పుడంటే? - Mathu Vadalara 2 Review
స్టార్ హీరో లైనప్‌లో ఏకంగా 9 సినిమాలు - రూ.650 కోట్ల బడ్జెట్‌తో! - Big Budget Upcoming Movies