Mechanic Rocky OTT Release : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లీడ్ రోల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'మెకానిక్ రాకీ'. రీసెంట్గా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయింది. అయితే ఇప్పుడీ చిత్రం సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వేదికగా అందుబాటులో ఉంది. ఈ విషయాన్ని తాజాగా ఆ సంస్థ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.
స్టోరీ ఏంటంటే :
నగుమోము రాకేశ్ అలియాస్ రాకీ (విశ్వక్ సేన్) బీటెక్ మధ్యలోనే నిలిపేసిన ఓ యువకుడు. తండ్రి రామకృష్ణ (నరేశ్ వీకే) నడుపుతున్న ఓ గ్యారేజీలో మెకానిక్‌గా సెటిలైపోతాడు. గ్యారేజ్‌లో రిపేర్లు చేయడంతో పాటు డ్రైవింగ్ కూడా నేర్పిస్తుంటాడు. అయితే రాకీ దగ్గర డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం మాయ (శ్రద్ధా శ్రీనాథ్), ప్రియ (మీనాక్షి చౌదరి) వస్తారు. రాకీ కాలేజీలో చదువుకునే సమయంలో తన మనసుకు దగ్గరైన అమ్మాయే ప్రియ. తన ఫ్రెండ్ చెల్లెలు కూడా. వీళ్లిద్దరి మధ్య లవ్‌ట్రాక్ స్టార్ట్ అనుకునేలోపు కొన్ని కారణాల వల్ల కాలేజీ డ్రాప్ అవ్వాల్సి వచ్చింది రాకీ. అయితే డ్రైవింగ్ స్కూల్ కారణంగా చాలా రోజుల తర్వాత మళ్లీ కలిసిన ప్రియ గురించి రాకీకి తెలిసిన కొత్త విషయాలేమిటి? మరి ఆ విషయాలు తెలుసుకుని ప్రియ కోసం రాకీ ఏం చేశాడు? వాళ్లిద్దరి జీవితాల్లోకి వచ్చిన మాయ వారి ఎలా ప్రభావితం చేసింది? ఇటువంటి విషయాలు తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాల్సిందే.
విశ్వక్ లైనప్
'జాతి రత్నాలు' ఫేమ్ డైరెక్టర్ కేవీ అనుదీప్‌తో కలిసి 'ఫంకీ' అనే సినిమా కోసం పని చేయనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఇది సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రెగ్యులర్ షూట్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఆషికా రంగనాథ్ ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేయనున్నట్లు సమాచారం. దీంతో పాటు రామ్ నారాయణ్ డైరెక్ట్ చేస్తున్న 'లైలా' అనే సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. ఇందులోని కొంత భాగం కోసం విష్వక్ అమ్మాయి గెటప్‌లో కనిపించనున్నారట. తాజాగా విడుదలైన టైటిల్ పోస్టర్‌తో అభిమానులు ఈ చిత్రం గురించి నెట్టింట తెగ చర్చించుకుంటున్నారు.
'జాతి రత్నాలు' డైరెక్టర్‌తో విశ్వక్ మూవీ - 'ఫంకీ'గా టైటిల్ అప్డేట్!
ద బాయ్స్ ఆర్ బ్యాక్!- త్వరలోనే సెట్స్‌పైకి 'ఈ నగరానికి ఏమైంది 2'!