Mathu Vadalara 2 OTT : యంగ్ హీరో శ్రీ సింహా లీడ్ రోల్లో నటించిన సినిమా 'మత్తు వదలరా 2'. 2019లో రిలీజైన 'మత్తు వదలరా' సినిమాకు ఇది సీక్వెల్గా తెరకెక్కింది. రితేజ్ రానా దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 13న రిలీజైన ఈ మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించి ఎంటర్టైన్ చేసిన ఈ సినిమా, తాజాగా ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వేదికగా శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు సహా, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమా అందుబాటులో ఉంది. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీ సింహతోపాటు సత్య, వెన్నెల కిషోర్, ఫరియా అబ్దుల్లా ఆయా పాత్రల్లో కనిపించి బాగా అలరించారు.