ETV Bharat / entertainment

మార్చి నెల ఓటీటీ సినిమా సిరీస్​ల ఫుల్ లిస్ట్​ - హనుమాన్​తో పాటు ఏం వస్తున్నాయంటే? - march 2024 ott movies

March 2024 OTT Release Movies List : మార్చి నెల వచ్చేసింది. ఈ సందర్భంగా ఈ నెలలో రాబోయే ఇంట్రెస్టింగ్ సినిమా సిరీస్​ల గురించి తెలుసుకుందాం. ఆ వివరాలు.

మార్చి నెల ఓటీటీ సినిమా సిరీస్​ల ఫుల్ లిస్ట్​ - హనుమాన్​తో పాటు ఏం వస్తున్నాయంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 29, 2024, 10:38 AM IST

Updated : Feb 29, 2024, 10:48 AM IST

March 2024 OTT Release Movies List : ఫిబ్రవరి నెల ముగియడంతో ఇక మార్చి నెలపై కన్నుపడింది ఓటీటీ మూవీ లవర్స్​కు. అయితే ఇప్పుడు సినిమా లవర్స్​కు గుడ్ న్యూస్​. ఈ మార్చి నెలలో ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్​లు వచ్చేస్తున్నాయి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీలివ్, జీ5 లాంటి ఓటీటీల్లో హనుమాన్, మహారాణి 3, ఫైటర్ లాంటి ఆసక్తికరమైన సినిమా, సిరీస్​లు వచ్చేందుకు రెడీ అయ్యాయి. మరి ఏ సినిమా, సిరీస్​లు ఎప్పుడు, ఎక్కడ రాబోతున్నాయో తెలుసుకుందాం.

  • ఈ ఏడాది మొదట్లోనే ఇండియా వైడ్​గా బ్లాక్ బస్టర్​ హిట్ అందుకున్న చిత్రం హనుమాన్. అతి తక్కువ రూ.30కోట్ల లోపు బడ్జెట్​తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ.250కోట్ల వరకు వసూలు చేసింది. ఇప్పటికే సంక్రాంతి సినిమాలన్నీ ఒక్కోక్కటిగా ఓటీటీల్లోకి రాగా హనుమాన్ ఒక్కటే ఆలస్యంగా మార్చి 2న రాబోతుంది. జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
  • మాస్ మహారాజా రవితేజ నటించి భారీ చిత్రం ఈగల్ రీసెంట్​గా రిలీజై మంచి హిట్ అందుకుంది. రవితేజను మళ్లీ సక్సెస్​ ట్రాక్ ఎక్కించింది. మార్చి 2 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలానే అమెజాన్ ప్రైమ్​లోనూ స్ట్రీమింగ్ కానుంది.
  • గురు ఫేమ్ రితికా సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన హారర్‌ మూవీ వ‌ళ‌రి(Valari). శ్రీరామ్‌ కీలక పాత్రధారి. మ్రితికా సంతోషిణి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీ ఈటీవీ విన్‌ లో మార్చి 6 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.
  • జీ5లో గతంలో వచ్చిన సన్ ఫ్లవర్ వెబ్​సిరీస్​కు మంచి రెస్పాన్స్ దక్కింది. దీంతో ఇప్పుడు కొత్త సీజన్ రాబోతోంది. ఈ సీజన్ 2 మార్చి 1 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.
  • మహారాణి సిరీస్​ తొలి రెండు సీజన్లకు విశేష ఆదరణ దక్కిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు మూడో సీజన్​ ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్చి 7 నుంచి ఈ సిరీస్ కొత్త సీజన్ సోనీలివ్​లో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ కూడా బాగానే ఆకట్టుకుంది.

ఇదీ చదవండి : మార్చి నెల థియేటర్లలో విడుదలయ్యే సినిమాలివే - ఆ 3 చిత్రాలు వెరీ స్పెషల్​!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, దీపికా పదుకొణె నటించిన ఫైటర్ చిత్రం జనవరి 25న విడుదలై భారీ వసూళ్లను సాధించింది. సిద్ధార్థ్ ఆనంద్ గత సినిమాల స్థాయిలో కలెక్షన్లను అందుకోలేకపోయినా సినిమాకు పాజిటివ్ రివ్యూస్​ వచ్చాయి. మార్చి 21 నుంచి నెట్‌ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్ కానుందీ చిత్రం.
  • బాలీవుడ్ ఇండస్ట్రీకు సంబంధించి వివిధ ఆసక్తికరమైన అంశాలను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నమే షోటైమ్. తెర వెనుక స్టార్ల లైఫ్ ఎలా ఉంటుంది?, ఓ సినిమా లేదా సిరీస్ షూటింగ్ ఎలా జరుగుతుంది? వంటి విషయాలను ఇందులో చూపిస్తారు. ఇది డిస్నీ హాట్ స్టార్ ప్లస్​లో మార్చి 8నుంచి రానుంది.
  • విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ నటించిన మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్ మెర్రీ క్రిస్మస్ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ చిత్రం మార్చి 8 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
  • బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీ ఖాన్ నటించిన యే వతన్ మేరే వతన్ చిత్రం డైరెక్ట్​గా ఓటీటీలోకి వస్తోంది. భారతదేశ స్వతంత్ర సమరయోధురాలు ఉషా మెహతా బయోపిక్​ ఇది.

NBK109 : ఆ రోజు ఫ్యాన్స్​కు బాలయ్య డబుల్ ట్రీట్​!

Last Updated : Feb 29, 2024, 10:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.