Manorathangal Webseries OTT : ఒకే స్క్రీన్‌పై ఇద్దరు హీరోలు కనిపిస్తే ఫ్యాన్స్‌కు వచ్చే ఆ కిక్కే వేరె లెవల్లో ఉంటుంది. అందుకే మల్టీస్టారర్ సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఇద్దరు లేదా ముగ్గురు హీరోలు ఉన్న మల్టీస్టారర్ సినిమాలు కాస్త ఎక్కువగానే తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరి ఒకే చిత్రంలో తొమ్మిది మంది స్టార్స్ కనిపిస్తే. ఇప్పుడు అలాంటి చిత్రమే ఒకటి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇది సినిమాలా కాకుండా వెబ్‌సిరీస్‌లా రాబోతుంది.
దాని పేరు మనోరతంగల్. తొమ్మిది కథలుగా రానున్న ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో 2021లోనే ప్రారంభమైంది. ఎట్టకేలకు ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. ఇందులో దిగ్గజ నటులు కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్‍లాల్‍తో పాటు ఫాహద్ ఫాజిల్, బిజు మీనన్, జరీనా, ఇంద్రన్స్, కైలాశ్, ఎంజీ పనికర్, నేదుముడి వేణు, సురభి లక్ష్మి, అపర్ణ బాలమురళి, ఇంద్రజిత్, జాయ్ మాథ్యూ, శాంతికృష్ణ, హరీష్ ఉత్తమన్, పార్వతి తిరువోతు, ఆసిఫ్ అలీ, మధు వంటి వారు ఇందులో నటించారు.
అలాగే ఈ 9 కథలకు ప్రియదర్శన్, శ్యామప్రసాద్, రంజిత్, సంతోష్ శివన్, జయరాజన్ నాయర్, రతీశ్ అంబట్, అశ్వతి నాయర్, మహేశ్ నారాయన్ ఇలా 8 మంది డైరెక్షన్ చేశారు. ప్రియదర్శన్ ఒక్కడే రెండు కథలకు దర్శకత్వం వహించగా మిగతా వారు చెరోకటి డైరెక్షన్ చేశారు.
ఈ మెగా అంథాలజీ సిరీస్ ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ కానుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దీన్ని విడుదల చేయనున్నారు. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం కన్నడ భాషల్లోనూ అందుబాటులో ఉండనుంది. తాజాగా దీని ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఇది సినీప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూడటం ప్రారంభించారు.
కాగా, ఇప్పటికే ఓటీటీ వల్ల మలయాళ సినిమాలకు ఆడియెన్స్‌లో బాగా క్రేజ్ పెరిగింది. వారి కంటెంట్‌ను భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు చూసేందుకు బాగా ఇష్టపడుతున్నారు. పైగా ఈ మధ్య థియేటర్లలోనూ మలయాళ సినిమా భారీ సక్సెస్‌లను సాధిస్తున్నాయి. మంచి వసూళ్లను అందుకుంటున్నాయి.
హైదరాబాద్‌లో స్టార్ హీరోల మధ్య 'వార్'!
షారుక్ సినిమాలో విలన్‌గా జూనియర్ అశ్వత్థామ - కన్ఫామ్ చేసిన అమితాబ్ - Sharukh Suhana Khan Movie