Rajinikanth Vettaiyan Movie Sensor : దసరా కానుకగా బాక్సాఫీసు ముందుకు రానున్న సినిమాల్లో 'వేట్టాయన్' కూడా ఒకటి. ఈ పండగ బరిలో దిగబోతున్న సినిమాల్లో ఇదే పెద్దది. సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం అక్టోబరు 10న థియేర్లలో రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గర పడడంతో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుందీ చిత్రం. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమా రన్‌టైమ్: 163.25 నిమిషాలు (2 గంటల 43 నిమిషాల 25 సెకన్లు). అయితే మూడు డైలాగ్స్‌పై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వాటిని మ్యూట్ చేయడమో, లేదా వేరే పదాలు వినియోగించడమో చేయాలని మూవీ టీమ్‌కు సూచించింది.
కాగా, ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, విలక్షణ నటులు ఫహాద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మంజు వారియర్ మరో కీలక పాత్రలో కనిపించనుంది. జై భీమ్ వంటి భారీ విజయం తర్వాత టి.జె.జ్ఞానవేల్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రమిది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది.
Manasilayo Song : ఆ మధ్య సినిమా నుంచి విడుదలైన 'మనసిలాయో' సాంగ్ కూడా విడుదలై మంచి విశేష ఆదరణను అందుకుంది. ఇందులో మంజు వారియర్ గ్లామర్, వేసిన డ్యాన్స్ స్టెప్పులు బాగా వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఇదే పాట కనిపిస్తోంది.
ఈ మధ్యే రజనీ కాంత్ కూడా వేట్టాయన్ సినిమా గురించి మాట్లాడారు. "మా మూవీ షూటింగ్ పూర్తైంది. మా బాధ్యతను మేం పూర్తిగా నిర్వర్తించాం. ఇక ఆడియెన్స్ మా సినిమా చూసి ఎలా ఉందనే విషయం చెప్పాలి. ప్రేక్షకులను ఆకట్టుకునేలా భారీ స్థాయిలో సినిమాను తీర్చిదిద్దాము. మా మూవీ నుంచి విడుదలైన మనసిలాయో ఇప్పటికే మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. ఆ పాట అంత మంచిగా రావడానికి కొరియోగ్రాఫర్ దినేశే ప్రధాన కారణం." అని రజనీకాంత్ పేర్కొన్నారు.
ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్ - ఏమైందంటే? - Rajnikanth Hospitalized