ETV Bharat / entertainment

ప్రభాస్​ 'కల్కి' కోసం రంగంలోకి మహేశ్​బాబు - నాగ్​ అశ్విన్ మాస్టర్​ ప్లాన్! ETV Bharat - Kalki 2898 AD - KALKI 2898 AD

Kalki 2898 AD Mahesh babu : ప్రభాస్ కల్కి సినిమాలో మహేశ్ బాబు భాగం కానున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు స్టోరీలో

ETV Bharat
Kalki 2898 AD (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 8, 2024, 12:51 PM IST

Kalki 2898 AD Mahesh babu : సలార్ హిట్ తర్వాత ప్రభాస్ కెరీర్ మళ్లీ గాడిలో పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడాయన చేస్తున్న ప్రాజెక్ట్​ల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఏడాది వేసవిలో విడుదల కావాల్సిన కల్కి 2898 AD ఎన్నికల కారణంగా వాయిదా పడి జూన్ 27న వచ్చేేందుకు సిద్ధమైంది. చిత్రంలో ప్రభాస్​తో పాటు దీపిక పదుకొణె, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, కమల్​ హాసన్​ లాంటి స్టార్ నటీనటులు నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో స్టార్ హీరో కూడా ఈ మూవీలో భాగస్వామ్యం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది. ఆయన మరెవరో కాదు సూపర్ స్టార్ మహేశ్​ బాబు. ఈ మూవీకి వాయిస్ ఓవర్ అందిచనున్నారనే వార్త ప్రస్తుతం ప్రచారంలోకి వచ్చింది.

ఇదే కనుక నిజమైతే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్​గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మహేశ్​ బాబు వాయిస్ ఓవర్ మరొక హైలైట్ అవుతుంది. అయితే ఈ విషయాన్ని కల్కి మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మహేశ్​ బాబు టాలీవుడ్ టాప్ హీరోల చిత్రాలకు వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇదేం మొదటిసారి కాదు. 2008లో వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా జల్సాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆ తర్వాత ఎన్టీఆర్ బాద్షాకు కూడా మహేశ్​ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆపైన చిరంజీవి ఆచార్యకు కూడా వాయిస్ ఓవర్ అందించారు.

ఇకపోతే మహేశ్​ బాబు రాజమౌళి కాంబోలో తెరకెక్కబోతున్న చిత్ర షూటింగ్ మొదలుకావడానికి సమయం పట్టే అవకాశం ఉంది. కనీసం మరో రెండు మూడేళ్లు మహేశ్​ బాబును తెర మీద చూసే అవకాశం లేదు. కాబట్టి మహేశ్​ ఫ్యాన్స్​కు కనీసం వాయిస్ ఓవర్ సర్​ప్రైజ్​ దక్కే ఛాన్స్ ఉంది. ఇక ప్రభాస్ కూడా కల్కి మూవీ తర్వాత బ్యాక్ టు బ్యాక్ మూవీస్​తో ఫ్యాన్స్​ను ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. రాజా సాబ్ కూడా ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
దిల్ రాజుతో పెద్ద గొడవ - కాళ్లు పట్టేసుకున్న సుకుమార్! - Dil Raju Sukumar

'పవర్ మన చేతిలో ఉంటే కేసులన్నీ కోర్టులోనే' - Pratinidhi 2 Release Trailer

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.