ETV Bharat / entertainment

గడ్డకట్టే చలిలో మహేశ్​ ట్రెక్కింగ్ - ఇదంతా ఆ సినిమా కోసమేనా ?​ - మహేశ్​ బాబు జర్మనీ ట్రిప్

Mahesh Babu Instagram Post : ఇటీవలే జర్మనీ టూర్​కు వెళ్లిన టాలీవుడ్ సూపర్​స్టార్ మహేశ్ బాబు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫొటోలను నెట్టింట షేర్ చేశారు. అవేంటంటే ?

Mahesh Babu Instagram Post
Mahesh Babu Instagram Post
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2024, 8:04 AM IST

Updated : Jan 30, 2024, 10:41 AM IST

Mahesh Babu Instagram Post : 'గుంటూరు' కారం తర్వాత తన నెక్స్ట్​ ప్రాజెక్టులపై ఫోకస్​ పెట్టారు టాలీవుడ్ సూపర్​స్టార్ మహేశ్ బాబు. అయితే తాజాగా జర్మనీకి వెళ్లిన ఆయన అక్కడ ఓ డాక్టర్​ పర్యవేక్షణలో తన ఫిట్​నెన్​ను మెయిన్​టెయిన్​ చేస్తున్నారని వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా మహేశ్​ ఇటీవలే షేర్ చేశారు. ఇదిలాఉండగా తాజాగా మహేశ్​ మరో ఇంట్రెస్టింగ్ ఫొటోలను తన అభిమానులతో పంచుకున్నారు.

జర్మనీలోని బాడెన్ అనే ప్రాంతంలో మహేశ్​, తన ఫిట్​నెస్ డాక్టర్ కోనిగ్​తో కలిసి బ్లాక్ ఫారెస్ట్ పర్వతంపై ట్రెక్కింగ్ చేశారు. "గడ్డ కట్టించే చలిలో డాక్టర్ హ్యారీ కోనిగ్​తో కలిసి బ్లాక్ ఫారెస్ట్​లో ట్రెక్కింగ్ చేశాను" అంటూ మహేశ్ దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. దీని చూసిన అభిమానులు మహేశ్ సాహసాలకు మెచ్చుకుంటున్నారు.

మరోవైపు ఈ పోస్ట్​పై మహేశ్ సతీమణి నమత్ర శిరోద్కర్​ కూడా కామెంట్ చేశారు. 'నిన్ను ఎంతో మిస్సవుతున్నా' అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ట్రెక్కింగ్ ఫొటోలతో పాటు నమ్రత కామెంట్​ నెట్టింట తెగ ట్రెండ్​ అవుతోంది. ఇప్పటికే రాజమౌళి డైరెక్షన్​లో తెరకెక్కనున్న మూవీ పట్టాలెక్కనున్నట్లు వార్తలొచ్చాయి. దీంతో మహేశ్ ఇప్పుడు ఆ సినిమా కోసం ఇలా కసరత్తులు చేస్తున్నారేమో అంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. 'SSMB 29' అప్​డేట్స్​ కోసం తీవ్రంగా ఎదురుచూస్తున్నారు.

SSMB 29 Shooting : అయితే తాజాగా SSMB 29 షూటింగ్​కు సంబంధించి ఓ న్యూస్ వైరల్​గా మారింది. 2024 ఏప్రిల్ 9 ఉగాది పండగ రోజున మహేశ్- రాజమౌళి ప్రాజెక్ట్ అఫీషియల్​గా లాంఛ్ కానున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ వేసవిలోనే సినిమా సెట్స్​పైకి వెళ్లనుందట. ఇక రెండేళ్లలోపే షూటింగ్​ కంప్లీట్ చేసి 2026 ఉగాదికి రిలీజ్​ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఇన్​సైడ్ టాక్. అయితే ఈ విషయం గురించి ఎలాంచి అధికారిక సమాచారం లేదు. కానీ, ఇప్పటికే కేఎల్ నారాయణ సినిమా ప్రొడ్యుసర్​గా కన్ఫార్మ్ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రముఖ నిర్మాత దిల్​రాజు కూడా సినిమా హక్కుల కోసం ట్రై చేస్తున్నట్లు టాక్.

'గుంటూరు కారం'లో మహేశ్​ కాల్చింది బీడీలు కాదంట - మరేంటంటే?

మహేశ్​ జర్మనీకి వెళ్లింది డాక్టర్‌ను కలవడానికా? - ఏమైంది?

Last Updated : Jan 30, 2024, 10:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.