Low Budget OTT Best Malayalam Movies : సినిమాల విషయంలో ప్రేక్షకుల అభిరుచి మారిన సంగతి తెలిసిందే. స్టార్ కాస్ట్, భారీ బడ్జెట్, ఎలివేషన్లు ఎన్ని ఉన్నా కంటెంట్‌కే ఓటు వేస్తున్నారు. అయితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లో బడ్జెట్‌తో కూడిన కంటెంట్ ఉన్న సినిమాలు తీయడంలో మలయాళ చిత్రసీమే ఎప్పుడు ముందుంటుంది. తాజాగా వచ్చిన ప్రేమలు చిత్రమే దీనికి నిదర్శనం. కేవలం రూ.3 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం తొలి రెండు వారాల్లోనే రూ.50 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ఆశ్చర్యపరిచింది. దీంతో పాటు భ్రమయుగం కూడా మంచి టాక్‌తో పాటు వసూళ్లను సాధించింది. అయితే మలయాళంలో గతంలోనూ పలు చిత్రాలు చాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి మంచి సక్సెస్‌ను అందుకున్నాయి. అవేంటో చూద్దాం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
తాజాగా విడుదలైన ప్రేమలు చిత్రంలాగే రొమాంటిక్ కామెడీ అయిన ఈ తన్నీర్ మాతన్ దినంగళ్ చిత్రం 2019లో విడుదలై మంచి సక్సెస్‌ను సాధించింది. అప్పట్లో రూ.3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.45 కోట్లను అందుకుని సెన్సేషనల్ సృష్టించింది. జైసన్ అనే ఓ హైస్కూలు పిల్లాడి చుట్టూ తిరిగే కథతో రూపొందింది.ఇది అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.
2015లో వచ్చిన కామెడీ జానర్ ఆది కప్యారె కూటమణి కేవలం రూ.2కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. ఫుల్ రన్ టైమ్‌లో బాక్సాఫీస్ వద్ద రూ.50కోట్ల వరకు వసూలు చేసింది. ఈ చిత్రంలో థ్రిల్లింగ్ క్లైమ్యాక్స్ హైలైట్ అనే చెప్పాలి. ఇది డిస్నీ హాట్ స్టార్రో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక మలయాళ రొమాంటిక్ మూవీ ప్రేమమ్ గురించి తెలియని వారు ఉండరేమో. పక్కా యూత్ ఫుల్ లవ్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, సాయి పల్లవి నటించారు. ఈ సినిమా ద్వారానే ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. 2015లో రిలీజైన ఈ సినిమా ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా నిలిచింది. రూ.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ.60 కోట్ల వరకు వసూలు చేసింది. ఇది కూాడా డిస్నీ హాట్ స్టార్‌లో అందుబాటులో ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
2015లో వచ్చిన కామెడీ థ్రిల్లర్ అమర్ అక్బర్ ఆంథోనీ అయితే మంచి సక్సెస్‌ను సాధించింది. నాదిర్షా డైరెక్ట్ చేశారు. సలార్ ఫేమ్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించారు. రూ.6.7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మలయాళం మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.50 కోట్ల వరకు వసూలు చేసింది. ఇది అమెజాన్ ప్రైమ్‌లో ఉంది.
2013లో మలయాళంతో పాటు తమిళంలోనూ ఒకేసారి తెరకెక్కిన నేరం చిత్రం అయితే కేవలం రూ.1.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర రూ.18 కోట్ల వరకు వసూలు చేయడం విశేషం. ఈ సినిమాను దాదాపుగా చెన్నైలోని మందవేలిలోనే షూట్ చేశారు. ఇది కూడా అమెజాన్ ప్రైమ్‌లో ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
1997లో విడుదలైన అనియత్తిప్రావు అనే చిత్రం కేవలం రూ.79 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.16 కోట్ల వరకు వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రాన్ని హిందీలో డోలీ సజాకే రఖ్నా పేరుతోనూ రీమేక్ చేయగా అది మంచి విజయాన్ని అందుకుంది. దీని ఓటీటీ ప్లాట్‌ఫామ్ గురించి స్పష్టత లేదు.
ఇక టోవినో థామస్ హీరోగా జూడ్ ఆంథనీ జోసెఫ్ డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం 2018. ఎవ్రీవన్ ఈజ్ ఏ హీరో ఉపశీర్షిక. క్యాప్షన్‌కు తగ్గట్లే ఈ కథ నడుస్తుంది. 2023లో విడుదలైన ఈ చిత్రం కేవలం రూ.15కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి పది రోజుల్లోనే రూ.100కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. సోనీ లివ్‌లో అందుబాటులో ఉంది. అలానే 2016లో మోహన్ లాల్ నటించిన మన్యం పులి రూ.25కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ.100కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇది హాట్ స్టార్‌లో అందుబాటులో ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సడెన్‌గా OTTలోకి వచ్చేసిన కిల్లర్ గేమ్ మూవీ - ప్రతీ సీన్ సూపర్ థ్రిల్‌తో!
ఆపరేషన్ వాలెంటైన్ - 'ఆ సినిమా కోసం నా పెళ్లి ముహూర్తాన్ని మార్చుకున్నా'