ETV Bharat / entertainment

గ్రాండ్​గా కృతి కర్బంద పెళ్లి - వేడుకలో అదే స్పెషల్ అట్రాక్షన్​ - Kriti Kharbanda Marriage Photos

Kriti Kharbanda Marriage Photos : బాలీవుడ్ స్టార్స్​ కృతి కర్బంద, పులకిత్​ సామ్రాట్​ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. దిల్లీలోని ఓ ప్రైవేట్​ హోటల్​లో అతి కొద్ది మంది సమక్షంలో ఈ పెళ్లి గ్రాండ్​గా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను నటి కృతి తన ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేసింది. వాటిని మీరూ ఓ లుక్కేయండి

Kriti Kharbanda Marriage Photos
Kriti Kharbanda Marriage Photos
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 16, 2024, 3:45 PM IST

Updated : Mar 16, 2024, 4:11 PM IST

Kriti Kharbanda Marriage Photos : బాలీవుడ్ స్టార్స్​ కృతి కర్బంద, పులకిత్​ సామ్రాట్​ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. దిల్లీలోని ఓ ప్రైవేట్​ హోటల్​లో అతి కొద్ది మంది సమక్షంలో ఈ పెళ్లి గ్రాండ్​గా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను నటి కృతి తన ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్ ఈ జంటకు కంగ్రాజ్యూలేషన్స్​ తెలుపుతున్నారు. ఫొటోలు చూడముచ్చటగా ఉన్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ఈ జంట పెళ్లి అవుట్​ఫిట్​ కూడా చాలా డిఫరెంట్​గా ఉంది. వరుడు గ్రీన్ కలర్ డ్రెస్​లో మెరవగా, వధువు పింక్​ కలర్​ లెహంగాలో కనిపించింది. ఇలా వీరిద్దరు కొత్త స్టైల్​లో డ్రెస్​ వేసుకోవడం వేడుకకు స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచింది.

Kriti Kharbanda Movies : ఇక కృతి సినిమాల విషయానికి వస్తే - 'బోణీ' అనే తెలుగు సినిమాతో కృతి టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతోనే ఆమె తన కెరీర్​ను మొదలుపెట్టింది. తొలి సినిమా ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టనప్పటికీ, నటిగా ఆమెకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో తెలుగులో వరసు ఆఫర్లు వచ్చాయి. దీంతో 'బోణీ' తర్వాత 'తీన్‌మార్', 'అలా మొదలైంది'. 'మిస్టర్ నూకయ్య', 'ఒంగోలు గిత్త', 'ఓం త్రీడీ', 'బ్రూస్ లీ' ఇలా టాలీవుడ్​లో వరుస ఆఫర్లు అందుకుని ఇక్కడి ప్రేక్షకులకు చేరువైంది.

ఆ తర్వాత కొంతకాలానికి బీటౌన్​కు షిష్ట్​ అయ్యి అక్కడి ఆడియెన్స్​ను అలరించింది. అలా గత ఆరేళ్ల నుంచి పూర్తిగా హిందీ సినిమాలపై ఫోకస్​ పెట్టింది. అప్పుడప్పుడు కన్నడ, తమిళ సినిమాల్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే బాలీవుడ్ హీరో పులకిత్ సామ్రాట్‌తో ఈమె రిలేషన్‌లో ఉన్నట్లు గతంలో రూమర్స్ వచ్చాయి.

కొంత కాలం వీటిపై స్పందించని జంట, ఆ తర్వాత ఆ వార్తలు నిజమే అంటూ ఒప్పుకున్నాయి. అప్పటి నుంచి ఈ ఇద్దరూ తమ రిలేషన్​షిప్​ను తెలియజేసేలా పలు పోస్ట్​లు నెట్టింట షేర్ చేసి సందడి చేశారు. కలిసి పలు చోట్లకు తిరిగారు. ప్రస్తుతం ఈ జంట బీటౌన్​లో పలు ప్రాజెక్టులతో బిజీ లైఫ్​ గడుపుతున్నారు.

సీక్రెట్​ రివీల్​ - ఎంగేజ్మెంట్ చేసుకున్న 'తీన్​మార్' హీరోయిన్​ ?

వెడ్డింగ్ బెల్స్ - ప్రియుడిని పెళ్లాడనున్న 'తీన్​మార్' బ్యూటీ!

Last Updated : Mar 16, 2024, 4:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.