ETV Bharat / entertainment

ఆ రియాల్టీ షోకు హోస్ట్​గా స్టార్ డైరెక్టర్ - ఏకంగా అన్ని కోట్ల రెమ్యునరేషన్! - Khatron Ke Khiladi 14 season

Khatron Ke Khiladi 14 season : ఓ రియాల్టీ షోను స్టార్ డైరెక్టర్ హోస్ట్ చేయబోతున్నారు. దీని కోసం ఆయన తీసుకోబోయే రెమ్యునరేషన్ హాట్ టాపిక్​గా మారింది. ఆ వివరాలు.​

ఆ రియాల్టీ షోకు హోస్ట్​గా స్టార్ డైరెక్టర్ - ఏకంగా అన్ని కోట్ల రేమ్యునరేషన్!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 14, 2024, 7:24 PM IST

Khatron Ke Khiladi 14 season : రెమ్యునరేషన్ తీసుకోవడంలో హీరోలు టాప్​ ప్లేస్​లో ఉంటారు. కానీ ఇప్పుడు హీరోలకు ఏమాత్రమూ తీసిపోమంటున్నారు డైరెక్టర్లు. స్టార్ హీరోలతో పోటీపడి మరీ భారీగా పారితోషికం తీసుకుంటున్నారు పలువురు దర్శకులు. తాజాగా ఓ హిందీ షో కోసం ప్రముఖ డైరెక్టర్ తీసుకోబుతున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుస్తే మీరు షాక్ అవ్వడం పక్కా.

ఇంతకీ ఆయన ఎవరంటే? బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి. ఈయనకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి పేరుంది. సూపర్ హిట్స్ సినిమాలను తెరకెక్కించిన ఈ డైరెక్టర్ ఇప్పుడు టీవీ రంగంలోనూ దూసుకుపోతున్నారు. అయితే టెలివిజన్ చరిత్రలో ఖత్రోన్ కె ఖిలాడీ పాపులర్ షోలలో ఒకటి. ఈ యాక్షన్ ప్యాక్డ్ షో ఇప్పటికే 13సీజన్లను పూర్తి చేసుకుంది. 14వ సీజన్ కోసం రెడీగా ఉంది. అయితే ఇప్పుడు ఈ షో గురించి ఓ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ రియాల్టీ షోను ఎప్పటి మాదిరిగానే స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి హోస్ట్ చేయబోతున్నారు. అయితే ఈ షోకు రోహిత్ శెట్టి భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. సీజన్ 14 కోసం ఏకంగా రూ. 16కోట్ల రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్నారని తెలిసింది.

గత సీజన్‌లో రోహిత్ శెట్టి ఒక్కో ఎపిసోడ్‌కు 50 లక్షలు వసూలు చేసినట్లు ఇంగ్లీష్ మీడియా కథనాలు కూడా చెబుతున్నాయి. ఒక ఎపిసోడ్‌ను హోస్ట్ చేయడానికి 50 లక్షలు నిజంగా చాలా పెద్ద మొత్తమే అని చెప్పవచ్చు. అయితే రోహిత్ శెట్టి ఇప్పుడు అంతకన్నా ఎక్కువ డబ్బు వసూలు చేయబోతున్నారట. ఈసారి ఒక్కో ఎపిసోడ్‌కు 60 నుండి 70 లక్షలు తీసుకోబోతున్నారని, అంటే మొత్తం సీజన్‌కు ఆయన ఫీజు దాదాపు 16 కోట్లు ఉంటుందని అంటున్నారు. ఇప్పటి వరకు టీవీ షోలను హోస్ట్ చేసిన వారెవరు కూడా ఇంత భారీ మొత్తంలో పారితోషికం తీసుకోలేదనే చెప్పాలి.

అయితే దీనిపై అధికార ప్రకటన లేదు. కాగా ఈ సీజన్​లో అభిషేక్ కుమార్, నీట్ భట్, మునావర్ ఫరూకీ, మన్నార్ చోప్రా వంటి స్టార్లు పాల్గొంటారని టాక్ వినిపిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం రోహిత్ శెట్టి - అజయ్ దేవగన్, దీపికా పదుకొణెలతో తెరకెక్కించిన కొత్త మూవీ సింగం ఎగైన్ విడుదల అయ్యేందుకు రెడీగా ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రాజమౌళి చెప్పిన ఆ ఒక్క మాట - ఇప్పటికీ పాటిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్​!

ఆ హీరోతో పెళ్లికి రెడీ అయిన 'జాతి రత్నాలు' ఫరియా అబ్దుల్లా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.