ETV Bharat / entertainment

ప్రశాంత్ నీల్​ ఇదంతా నిజమేనా? - Prasanth Neel Ajith Kumar - PRASANTH NEEL AJITH KUMAR

KGF Prasanth Neel Ajith Kumar : కోలీవుడ్‌ స్టార్ హీరో అజిత్‌ కేజీయఫ్‌ యూనివర్స్‌లోకి అడుగుపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏకంగా రెండు సినిమాలు చేయబోతున్నారట. పూర్తి వివరాలు స్టోరీలో

Source ETV Bharat
Prasanth Neel Ajith Kumar (Source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 24, 2024, 12:04 PM IST

Updated : Jul 24, 2024, 12:11 PM IST

KGF Prasanth Neel Ajith Kumar : సోషల్​ మీడియా అదిరిపోయే సినిమా న్యూస్​ ఒకటి మూవీలవర్స్​ను షాక్​కు గురి చేసింది. కేజీయఫ్ ఫేమ్​ ప్రశాంత్ నీల్​, కోలీవుడ్ స్టార్ హీరో అజిత్​తో కలిసి ఏకంగా రెండు సినిమాలు చేయబోతున్నట్లు జోరుగా ప్రచారం అవ్వడం మొదలైంది. అయితే దీనిపై అఫీషియల్​ అనౌన్స్​మెంట్ లేదు కానీ దాదాపుగా ఇవి కన్ఫామేనని చెన్నై సినీ వర్గాల సమాచారం.

తలాకు ప్రశాంత్ నీల్ రెండు సినిమా కథలు చెప్పారని అంటున్నారు. అందులో ఒకటి సినిమాటిక్ యూనివర్స్(కేజీయఫ్​ 3కు కనెక్ట్ అయ్యేలా)​ కాగా, మరొకటి ఇండివిడ్యుయెల్ సబ్జెక్ట్​తో ఉంటుందని వాటి సారాంశం. అయితే దీని నిర్మాణ సంస్థ ఎవరు? సినిమాలో ఇంకా ఎవరెవరు నటిస్తారు అనేది పక్కా సమాచారం లేదు. మరి ఇందులో నిజమెంతో తెలీదు కానీ అజిత్ ఫ్యాన్స్ మాత్రం దీన్ని తెగ వైరల్ చేస్తున్నారు.

అయితే వాస్తవానికి ప్రశాంత్ నీల్​కు చాలా కమిట్​మెంట్స్ ఉన్నాయనే చెప్పాలి. సలార్ పార్ట్ 2 శౌర్యంగపర్వం కోసం ప్రభాస్ ఫ్యాన్స్​ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ డేట్లు అడ్జెట్​ అవ్వాల్సి ఉంది. కానీ ఆయన ఎప్పుడు ఇస్తారో తెలీదు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్​తో డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) చేయాలి. భారీ బడ్జెట్​తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. భవిష్యత్తులో కేజీయఫ్​ 3 యశ్​తో పాటు నిర్మాత విజయ్ పలు సందర్భాల్లో చెప్పారు.

ఇవి మాత్రమే కాకుండా రామ్​చరణ్​తోనూ ఓ సినిమా ఉండొచ్చనే ప్రచారం ఆ మధ్య సాగింది. మరి ఇంత టైట్ ప్లానింగ్​లో అజిత్​తో రెండు సినిమాలు ప్రశాంత్ నీల్ ఎలా, ఎప్పుడు చేస్తారనేది సినీ ప్రియుల్లో మెదులుతున్న అతి పెద్ద ప్రశ్న. త్వరలోనే దీని గురించి తెలియనుంది.

ఇకపోతే అజిత్​ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న విదా ముయార్చిలో నటిస్తున్నారు. మాగిజ్‌ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్​గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు. దీని తర్వాత అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ చేయనున్నారు. మైత్రీ మూవీమేకర్స్‌ బ్యానర్​పై ఇది రూపుదిద్దుకోనుంది.

యశ సరసన ఇద్దరు భామలు - ఆమె మాత్రం పక్కా 'టాక్సిక్​' - Yash Toxic Movie

వామ్మో - సల్మాన్​ ఖాన్ బాడీగార్డ్​ జీతం నెలకు అన్ని లక్షలా? - Salman Khans bodyguard Salary

Last Updated : Jul 24, 2024, 12:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.