ETV Bharat / entertainment

'20 ఏళ్ల తర్వాత రోలెక్స్‌ కోసమే అలా చేశా - కమల్​హాసన్​ అంటే భయమేసింది!' - సూర్య - KANGUVA SURIYA ABOUT ROLEX

'కంగువా' ప్రమోషన్స్​లో రోలెక్స్​ సినిమా గురించి మాట్లాడిన సూర్య - కమల్​ హాసన్​పై కూడా కామెంట్స్​!

Kanguva Suriya About Rolex kamalhassan
Kanguva Suriya About Rolex kamalhassan (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 29, 2024, 6:42 PM IST

Kanguva Suriya About Rolex : కొంతకాలం నుంచి వైవిధ్యమైన కథలు, పాత్రలతో కోలీవుడ్​, టాలీవుడ్​ ప్రేక్షకులను అలరిస్తున్నారు హీరో సూర్య. ప్రస్తుతం ఆయన కంగువా ప్రమోషన్స్​తో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా ఆడియెన్స్​కు రీచ్​ అయ్యేలా శ్రమిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో సూర్య పోషించిన పాత్రల్లో విక్రమ్​లోని 'రోలెక్స్'​ రోల్​ ఇండియా వైడ్​గా అందరినీ ఆకట్టుకుంది. డ్రగ్స్‌ మాఫియాను శాసించే అధినేతగా ఆయన కనిపించింది కాసేపే అయినా, థియేటర్‌ మొత్తం దద్దరిల్లిపోయింది. ఇంకా చెప్పాలంటే ఆ పాత్రకు ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. తాజాగా ప్రమోషన్స్​లో ఈ రోలెక్స్ పాత్ర గురించి మరోసారి మాట్లాడారు సూర్య. కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పారు.

ధూమపానానికి 20 ఏళ్లుగా దూరంగా ఉన్న సూర్య, కేవలం రోలెక్స్‌ పాత్ర కోసం మళ్లీ సిగరెట్‌ కాల్చారు. "మొదట సిగరెట్‌ లేకుండా సీన్​ చేద్దామనుకున్నాం. అయితే నెగటివ్​ షేడ్స్ ఉన్న పాత్ర కావడం వల్ల మరింత ఇంటెన్స్‌ కోసం సిగరెట్‌ కాల్చాల్సి వచ్చింది. డైరెక్టర్​ లోకేష్‌ రోలెక్స్‌ పాత్ర గురించి ఓ ఐడియా మాత్రమే చెప్పారు. అసలా సీన్‌ ఏంటి? పాత్ర ఎలా ఉంటుంది? అనేది తెలిపారు. షూటింగ్‌ వెళ్లే ముందు రిహార్సల్స్‌ కూడా చేయలేదు. పైగా షూటింగ్‌ రోజు ఉదయమే డైలాగ్స్‌ను పంపారు. అది చదివి సెట్‌కు వెళ్లిపోయా. మధ్యాహ్నానికి నాకు సంబంధించిన షూట్‌ పూర్తయింది" అని తెలిపారు.

Kanguva Suriya About Kamal Hassan : కమల్‌ హాసన్‌ ఎదుట నటించాలంటే కాస్త భయపడినట్లు చెప్పారు సూర్య. తనకు సంబంధించిన సీన్స్​ తీసే సమయంలో కమల్‌ హాసన్‌ సెట్‌కు వస్తారని మూవీటీమ్ చెప్పిందట. దీంతో దర్శకుడు లోకేష్‌ను పిలిచి ఆయన వచ్చేలోపు నా సీన్స్​ పూర్తి చేసేయ్‌ అని సూర్య కోరారట.

Rolex Movie : కాగా, లోకేశ్​ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా రోలెక్స్‌ పేరుతో ప్రత్యేకంగా ఓ మూవీ రానుంది. గతంలో సూర్య నటించిన మరో చిత్రంతో దీనికి కనెక్షన్‌ ఉన్నట్లు ఇటీవలే సూర్య తెలిపారు. ప్రస్తుతం సూర్య నటించిన కంగువా నవంబరు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

'తండేల్‌' జనవరికి సిద్ధమే, కానీ ఓ ట్విస్ట్​ ఇచ్చిన డైరెక్టర్​!

మహేశ్ బాబు రామ్​పోతినేని సినిమా - లేటెస్ట్ అప్డేట్ ఇదే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.