ETV Bharat / entertainment

కంగనాకు సెన్సార్ షాక్‌ - 'ఎమర్జెన్సీ' మరోసారి వాయిదా! - Kangana Ranaut Emergency

Kangana Ranaut Emergency : బాలీవుడ్ నటి కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. ఈనెల 6న థియేటర్లలో రిలీజవ్వాల్సిన ఈ చిత్రం మరికొన్ని రోజులు ఆలస్యంగానే ప్రేక్షకుల ముందుకురానుంది. ఇంతకీ ఏమైందంటే?

Kangana Ranaut Emergency
Kangana Ranaut (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 6, 2024, 1:36 PM IST

Kangana Ranaut Emergency : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ డైరెక్షన్‌లో తెరకెక్కిన 'ఎమర్జెన్సీ' మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. ఈనెల 6న థియేటర్లలో రిలీజవ్వాల్సిన ఈ చిత్రం మరికొన్ని రోజులు ఆలస్యంగానే ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే ఇప్పటికే పలు కారణాల వల్ల ఈ సినిమా పోస్ట్‌పోన్ అవుతూ వచ్చిన సంగతి తెలిసిందే. సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ జారీ చేయని కారణంగా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ మరింత లేట్ అవ్వనుంది.

ఇక తన మూవీ పోస్ట్‌పోన్‌కు చింతిస్తూ కంగనా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. అభిమానులకు ఈ విషయాన్ని తెలియజేసేందుతు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ అప్‌లోడ్ చేసింది.

"నా డైరెక్షన్‌లో రూపొందిన 'ఎమర్జెన్సీ' సినిమా మరోసారి వాయిదా పడిందని చెప్పడానికి నాకెంతో బాధగా ఉంది. సెన్సార్‌ బోర్డు నుంచి సర్టిఫికెట్‌ కోసం మేము ఇంకా ఎదురుచూస్తున్నాం. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను తేదీని ప్రకటిస్తాం. మమ్మల్ని ఇంతగా అర్థం చేసుకుంటున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు" అంటూ రాసుకొచ్చింది.

అయితే 'ఎమర్జెన్సీ' సెన్సార్‌ సర్టిఫికెట్ కోసం ఆ మూవీ టీమ్‌ బాంబే హైకోర్టును సంప్రదించగా, అక్కడ వారికి ఊరట లభించలేదు. సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలంటూ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ను తాము ఆదేశించలేమంటూ బాంబే హైకోర్టు క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది.

ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే ఈ సినిమాపై నెట్టింట తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా శిరోమణి గురుద్వార ప్రబంధక్‌ కమిటీ (ఎస్‌జీపీసీ) సెన్సార్‌ బోర్డుకు రాసిన లేఖ కాస్త దుమారమైంది. అందులో తమ వర్గం గురించి తప్పుగా చిత్రీకరించారంటూ అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కంగనా హత్య బెదిరింపులను సైతం ఎదుర్కొన్నారు.

ఇక ఎమర్జెన్సీ విషయానికి వస్తే, భారతదేశంలో చీకటిరోజులుగా పిలిచే ఎమర్జెన్సీ సమయంలో జరిగిన పరిణామాలు, పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో ఇందిరాగాంధీ పాత్రలో నటి కంగన కనిపించగా, మహిమా చౌదరి,అనుపమ్‌ ఖేర్‌ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. మరో విశేషం ఏంటంటే కంగనా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి నిర్మాతగానూ ఆమెనే వ్యవహరించారు.

పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే: కంగనా రనౌత్ - Kangana Ranaut Marriege

'ఎమర్జెన్సీ' ట్రైలర్ రిలీజ్- పవర్​ఫుల్ ఉమెన్​గా కంగనా రనౌత్​! - Kangana Ranaut Emergency

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.