Kamal Haasan Thug Life : కోలీవుడ్‌లోని వెర్సటైల్ యాక్టర్లలో లోకనాయకుడు కమల్ హాసన్ ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా తన నటనతో అభిమానులను అలరిస్తుంటారు. ఇటీవలే విడుదలైన 'ఇండియన్ 2' ఆయనకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. భారీ అంచనాల నడుమ వచ్చినప్పటికీ ఈ చిత్రం ఆడియెన్స్‌ను మెప్పించలేకపోయింది. దీంతో ప్రస్తుతం మిక్స్డ్ టాక్‌తో థియేటర్లలో రన్ అవుతోంది. భారతీయుడు 1కి వచ్చిన రెస్పాన్స్‌లో సగం రాకపోవడం కమల్‌కు మరింత మైనస్‌గా మారింది. దీంతో ఆయన లైనప్‌పై అభిమానుల్లో మరింత ఉత్కంఠ నెలకొంది.
ఒక వేళ 'ఇండియన్ 2' మంచి టాక్‌తో దూసుకెళ్లుంటే మరో ఆరు నెలల్లో మూడో పార్ట్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారట. అందుకోసమే రెండో పార్ట్ చిత్రీకరణ సమయంలోనే మూడో భాగానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసుకుంటూ వచ్చారు డైరెక్టర్ శంకర్. ఫుటేజ్ కూడా దాదాపు సిద్ధంగానే ఉందని సమాచారం.
అయితే కమల్ హాసన్ సూచన మేరకు 'ఇండియన్ 3' రిలీజ్లో మార్పులు చేయనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. రెండో పార్ట్ రిజల్ట్‌ను దృష్టిలో ఉంచుకుని మూడో భాగాన్ని కాస్త ఆలస్యంగా విడుదల చేయాలని కమల్ తాజాగా మేకర్స్‌తో అన్నారట. దీంతో ఈ సినిమా రిలీజ్ ఇంకాస్త వాయిదా పడేలా ఉండనుందని సమాచారం.
ఇక కమల్ ప్రస్తుతం 'థగ్ లైఫ్' షూటింగ్లో బిజీగా ఉన్నారు. తన సొంత ప్రొడక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతున్నందున ఆయన మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు కీలక షెడ్యూల్స్ పూర్తి కాగా, వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే 'ఇండియన్ 3'కు బదులుగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక 'థగ్ లైఫ్' విషయానికి వస్తే, స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో శింబు, గౌతమ్ కార్తీక్, దుల్కర్ సల్మాన్, జయం రవి, ఐశ్వర్యలక్ష్మి, త్రిష లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మాలీవుడ్ వెర్సటైల్ నటుడు జోజు జార్జ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.
1000 కత్తుల పదునుతో సేనాపతి - కమల్, కాజల్ కత్తి యుద్ధం చూశారా? - Indian 3 trailer
టాలీవుడ్ వల్లే నేను స్టార్‌ను అయ్యా- ఎన్నో కష్టాలు పడి!: కమల్ - Bharateeyudu 2 Pre Release Event