ETV Bharat / entertainment

'కల్కి' Vs చిన్న సినిమాలు - ఈ వారం థియేటర్​ మూవీస్​లో మీ ఛాయిస్ ఏంటి? - This Week Theatre Releases

This Week Theatre Releases : 'కల్కి 2898 ఏడీ' ఇంకా థియేటర్లలో కొనసాగుతున్న తరుణంలో ఈ వారం కొన్ని చిత్రాలే విడుదలకు సిద్ధమయ్యాయి. అవి కూడా చిన్న సినిమాలే. ఇంతకీ అవేంటి? వాటి టాక్ ఎలా ఉందంటే?

source ETV Bharat
This Week Theatre Releases (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 19, 2024, 1:14 PM IST

This Week Theatre Releases : టాలీవుడ్ బాక్సాఫీస్​ ముందు గత మూడు వారాలుగా 'కల్కి 2898 ఏడీ' పేరు తప్ప మరో సినిమా పేరు వినిపించడం లేదు. జూన్ 27న రిలీజైన ఈ చిత్రం దాదాపు రూ.1000 కోట్లకు(Kaki 2898 AD collections) పైగా వసూళ్లను సాధించి మరింత ముందుకు వెళ్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

కల్కి రిలీజ్ నేపథ్యంలో ఆ సినిమాకు ముందు, వెనక వారాల్లో చెప్పుకోదగ్గ చిత్రాలేమీ విడుదల చేయలేదు. అయితే కల్కి కాస్త జోరు తగ్గాక ఈ నెల 12న వచ్చిన 'భారతీయుడు-2' భారీ అంచనాల మధ్య రిలీజైంది. కానీ అది ఆశించిన స్థాయిలో ఆడలేదు. మిక్స్​డ్ టాక్​ నుంచి డిజాస్టర్​ దిశగా వెళ్లింది. దీంతో మళ్లీ కల్కినే ఊపందుకుని బాక్సాఫీస్ ముందు పరుగెత్తింది. అయితే మళ్లీ ఇప్పుడు కల్కి జోరు కాస్త తగ్గగానే ఈ వారం తెలుగు నుంచి కొన్ని చిన్న సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. మరి అవి కల్కిని తట్టుకుంటాయో లేదా అన్నది చూడాలి.

Priyadarshi Darling Movie Review : ముందుగా ఈ వారం విడుదలయ్యే కొత్త చిత్రాల్లో చెప్పుకోవాల్సింది 'డార్లింగ్'. కమెడియన్‌గా పరిచయమై 'మల్లేశం', 'బలగం' లాంటి చిత్రాలతో కాస్త ఇమేజ్​ పెంచుకున్న ప్రియదర్శి నటించిన చిత్రమిది. ఇందులో నభా నటేశ్ హీరోయిన్​గా ​ నటించగా కొత్త దర్శకుడు అశ్విన్ దీన్ని తెరకెక్కించారు. 'హనుమాన్' మేకర్స్ దీన్ని ప్రొడ్యూస్ చేశారు. నేడు(జులై 19) సినిమా మంచి టాకే వినిపిస్తోంది.

దీంతో పాటు తమిళ యాక్టర్​ వినోద్ నటించిన 'పేకమేడలు'(Pekamedalu Review) ఈ వారం థియేటర్లలోకి దిగుతోంది. దీనికి పెయిడ్ ప్రిమియర్స్ వేయగా ఫర్వాలేదనిపించే స్పందన వచ్చింది. ఇంకా 'ది బర్త్ డే బాయ్'​తో పాటు మరిన్ని చిన్న సినిమాలు ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే అవి ప్రేక్షకుల దృష్టిలో పెద్దగా పడుతున్నట్లు లేవు. మరి ఈ లేటెస్ట్​ రిలీజ్ సినిమాలు మరింత మంచి టాక్​తో దూసుకెళ్తే ఓకే కానీ లేదంటే మరో వారం కల్కి దూకుడే ఉంటుంది.

ఐదుగురు భార్యలతో హనీమూన్! - వీకెండ్ స్పెషల్ ఈ వారం OTTలో సినిమాలివే - This Week OTT Releases

ఈ హారర్ మూవీ వెరీ డేంజర్​ - ఆ దెయ్యం శాపం వల్ల నిజంగానే ఆరుగురు నటులు దుర్మరణం! - Horror Movie on OTT

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.