kalki 2898 AD Makers Pay Tribute To Ramoji Rao : డైరక్టర్ నాగ్ అశ్విన్ విజువల్ వండర్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ కల్కి 2898 AD జూన్ 27న గ్రాండ్‌గా రిలీజ్ అయింది. బెనిఫిట్ షో నుంచే భారీ సంఖ్యలో అభిమానులు, సినీ ప్రేమికులు థియేటర్లలో సందడి చేశారు. సోషల్ మీడియాను కల్కి 2898 AD రివ్యూలతో, సినిమాలోని సన్నివేశాలతో షేక్ చేసేస్తున్నారు. మొత్తంగా ఈ సినిమాలోని ప్రతి సీన్ ఊహకందని రేంజ్లో కళ్లకు కట్టినట్టుగా చూపించి ప్రేక్షకులకు కనువిందు చేసింది.
అయితే ఈ సినిమా నిర్మాణ దశలో ఉండగానే కన్నుమూసిన ప్రభాస్ పెద్దనాన్న కృష్ణం రాజుకు, రీసెంట్గా తుదిశ్వాస విడిచిన బహుముఖ ప్రఙాశాలీ అయిన రామోజీరావుకు నివాళులర్పించింది మూవీటీమ్. థియేటర్లలో టైటిల్స్ పడే సమయంలో ఈ లెజెండ్స్‌కు హృదయపూర్వక నివాళి అర్పిస్తున్నట్లు ప్రకటించింది. వాటి ఫొటోలను తెరపై ప్రదర్శన చేసింది. మీడియా దిగ్గజమైన రామోజీ రావు, సీనియర్ రెబల్ స్టార్ కృష్ణం రాజు తెలుగు సినీ పరిశ్రమకు ఎనలేని సేవ అందించారని తెలిపింది.
ఇటీవలే పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత అయిన రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావు 87ఏళ్ల వయస్సులో తుది శ్వాస విడిచారు. సినిమా రంగానికి, ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమకు ఆయన సేవలు అందించారు. ఆయనలోని క్రియేటివిటీ, ఇన్నోవేషన్ భావితరాల నిర్మాతలకు, ఆర్టిస్టులకు ప్రేరణగా నిలిచేలా జీవించారు. మీడియా రంగంలో కొన్ని వందల మందికి ఉపాధి కల్పించారు. ఇక ఉప్పలపాటి కృష్ణం రాజు కేవలం నటనతోనే కాకుండా తన వారసత్వంగా ప్రభాస్‌ను తెలుగు సినీ పరిశ్రమకు అందించారు. ఆయన 2022 సెప్టెంబర్ నెలలో 83 ఏళ్ల వయస్సులో ఉండగా కనుమూశారు.
ST #Kalki2898AD #KALKI #kalki2898ad Excellent Movie @nagashwin7 Nuvu tope anna 🙏🏻 #Prabhas Anna love you as always… Next level… @SrBachchan sir 🫡🫡 @deepikapadukone Superb acting 👊 #BlockbusterKalki Must watch in Big screens 🙌 pic.twitter.com/JNYZzXBSZN
— PK REDDY (@REDDY_PK_SEA) June 26, 2024
kalki 2898 AD Movie Review: కాగా, నాగ్ అశ్విన్ చక్కటి కథాంశంతో కల్కి 2898 ADలోని పాత్రలను తీర్చిదిద్దారు. ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ నటించిన ఈ చిత్రంలో తన టేకింగ్‌తో ఇండియా సినిమా స్థాయిని పెంచేశారు. తొలి షో నుంచే సినిమా బ్లాక్ బస్టర్ టాక్ అందుకోవడంతో ప్రశంసల వర్షం కురుస్తుంది. ముందుగా ప్రచారం సాగినట్టే దుల్కర్ సల్మాన్, మృనాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ లాంటి యంగ్ స్టార్స్ సినిమాలో కనిపించి మంచి సర్ప్రైజ్ ఇచ్చారు. సంగీతం సమకూర్చిన సంతోష్ నారాయణన్ ప్రేక్షకుల నుంచి ఎక్కువ మార్కులు కొట్టేస్తున్నారు. ఇక యానిమేషన్‌లో అయితే కురుక్షేత్ర యుద్ధ సన్నివేశాలను ప్రత్యక్షంగా చూసిన ఫీలింగ్ తెప్పించిన మూవీటీమ్ చివరిగా అందరూ ఊహించినట్లుగానే సినిమా రెండో పార్ట్ ఉండబోతుందని అధికారికంగా కన్ఫామ్ చేసింది.
నార్త్ అమెరికాలో 'కల్కి' విధ్వంసం - RRR రికార్డ్ స్మాష్
'కల్కి' ట్విటర్ రివ్యూ - సినిమా టాక్ ఎలా ఉందంటే? - Kalki 2898 AD Movie Review
'కల్కి 2898 ఏడీ' - ఇది మరో ప్రపంచానికి ఆరంభం - Kalki 2898 AD Movie Review