Kalki 2898 AD Pre Release Event : కల్కి 2898 ఏడి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ దీపికా పదుకొణె బేబీ బంప్‌తో పాల్గొనడం విశేషం. ఆమె బ్లాక్ టైట్ ఫిట్ డ్రెస్ ధరించడంతో బేబీ బంప్ స్పష్టంగా కనిపించింది. ప్రెగ్నెంట్ అయ్యాక ఆమె ఇలా ఈవెంట్లో కనిపించడంతో ఫ్యాన్స్ ఎగబడి మరీ ఫోటోలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా దీపికా పదుకొణె మాట్లాడుతూ కల్కి షూటింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడింది. "సినిమాలో నేను తల్లి పాత్రలో కనిపిస్తాను. నాగ్ అశ్విన్ కథ చెప్పినప్పుడు ఎప్పుడు లేని ఓ కొత్త అనుభవం కలిగింది. వండర్‌గా అనిపించింది. అద్భుతమైన లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్టుగా ఉంటుంది. అశ్విన్ హెడ్లో ఏదో మ్యాజిక్ జరిగింది. అది ఇప్పుడు సినిమాగా రాబోతుంది." అని అన్నారు.
ఇంకా ప్రభాస్ గురించి కూడా మాట్లాడింది దీపికా పదుకొణె. ఆయనపై ప్రశంసలు కూడా కురిపించింది. "షూటింగ్‌లో ఉన్న రోజులన్నీ ప్రభాస్ ఇంటి నుంచే ఫుడ్ వచ్చేది. అద్భుతమైన వంటకాలను తినిపించారు. రోజూ ఆయన ఇంటి నుంచి ఫుడ్ వస్తుంటే ఎంతో హ్యాపీగా అనిపించింది. ఇదొక బెస్ట్ ఎక్స్ పీరియెన్స్" అని చెప్పుకొచ్చింది.
Deepika Padukone Prabhas : ఇక స్టేజ్‌పై నుంచి దీపికా పదుకొణె కిందకు దిగుతుంటే ప్రభాస్ లేచి ఆమెను పట్టుకుని నడిచారు. దీపికా ప్రెగ్నెంట్‌గా ఉన్న నేపథ్యంలో ప్రభాస్ లేచి ఆమె చేయి పట్టుకుని తీసుకురావడాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇదే సమయంలో బిగ్ బి అమితాబ్ కాస్త ఫన్ కూడా క్రియేట్ చేశారు. దీపికాను ప్రభాస్ పట్టుకుంటే, ప్రభాస్‌ను అమితాబ్ బచ్చన్ పట్టుకుని నవ్వులు పూయించారు. తాను కడా దీపికాను పట్టుకుంటాను అని పోటీ పడ్డారు, దీంతో ఈవెంట్ మొత్తం నవ్వులు విరిసాయి. ఈవెంట్‌లోనే ఈ దృశ్యం హైలైట్‌గా నిలిచిందని చెప్పాలి. కాగా, ఈ కార్యక్రమంలో ఇంకా అశ్వనీ దత్, ప్రియాంక దత్, స్వప్న దత్ కూడా పాల్గొన్నారు. ఇకపోతే కల్కి సినిమా జూన్ 27 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
రావణ బ్రహ్మగా ప్రభాస్! - ఏ సినిమాలో అంటే? - Prabhas as RavanaBramha