Kalki 2898 AD Prabhas Entry : రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్న మూవీ 'కల్కి 2898 AD'. సైన్స్ ఫిక్షన్‌గా రూపొందిన ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినిమాకు సంబంధించిన పలు ఇంట్రెస్ట్ ఫ్యాక్ట్‌ను రివీల్ చేయగా, తాజాగా ఇన్‌స్ట్రాగ్రామ్ లైవ్‌లోనూ ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా నాగ్ అశ్విన్, హీరో ప్రభాస్‌తో కలిసి ఇన్స్టాగ్రామ్ వేదికగా లైవ్ వచ్చారు. ప్రభాస్‌తో ముచ్చటించిన ఆయన ఫ్యాన్స్ కోసం సూపర్ అప్డేట్స్ను షేర్ చేశారు. ఇక డార్లింగ్ కూడా పలు సీక్రెట్స్‌ను రివీల్ చేశారు.
"క్లైమాక్స్‌లో ఓ సర్ప్రైజ్ సాంగ్ ఉంటుంది. సెకెండాఫ్‌లో దాదాపు 80 శాతం యాక్షన్ సీన్సే ఉంటాయి. ఇక మూవీ స్టార్ట్ అయిన 20-22 నిమిషాలకు ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. ఇది బెస్ట్ ఇంట్రో సీన్ అని నా అభిప్రాయం"అంటూ నాగీ వెల్లడించారు.
ఇక ప్రభాస్ కూడా ఈ సినిమాకు సీక్వెల్ ఉన్నట్లు హింట్ ఇచ్చేశారు. అంతే కాకుండా దుల్కర్ సల్మాన్, విజయ్‌దేవరకొండకు ఇదే లైవ్‌లో స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. దీంతో నాగ్ అశ్విన్ ఈ చిత్రంలో వాళ్లిద్దరూ కూడా ఉన్నారంటూ రివీల్ చేశారు.
" dulquer salmaan & vijay deverakonda are in the film" - @nagashwin7 🔥#Prabhas #Kalki2898AD #NagAshwin #AmitabhBachchan #DulquerSalmaan #VijayDeverakonda pic.twitter.com/HbGDVGO3kv
— Ayyo (@AyyoEdits) June 26, 2024
ఇదిలా ఉండగా, టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారట. సినిమాలో ఓ ఇంపార్టెంట్ సీన్లో జక్కన్న పాత్ర కనిపిస్తోందని అంటున్నారు. డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ కూడా కనిపించనున్నారని సమాచారం.
ఇక కల్కి సినిమా విషయానికి వస్తే, జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొనె, దిశా పటాని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి స్టార్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. వీరితో పాటు మాళవిక నాయర్, పశుపతి, శోభన లాంటి స్టార్స్ కీలక పాత్ర పోషించారు. వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశారు.
'కల్కి' మూవీకి వెళ్తున్నారా? ఈ 14 విషయాలు తెలిస్తే సినిమా చూడటం వెరీ ఈజీ! - Kalki 2898 AD
రూ.4 వేల రెమ్యునరేషన్ నుంచి రూ.600 కోట్ల వరకు! - Kalki 2898 AD Director Nag Ashwin