Kalki 2898 AD Mathura: రెబల్ స్టార్ ప్రభాస్ భారీ బడ్జెట్ చిత్రం 'కల్కి AD 2898' విడుదల దగ్గరపడుతోంది. దీంతో మూవీటీమ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. మేకర్స్ సినిమాను దేశవ్యాప్తంగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా కోసం ప్రత్యేకంగా రూపొందించిన బుజ్జి (కారు)ని దేశంలో పలు ప్రధాన నగరాల్లో తిప్పి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఇక తాజాగా మూవీటీమ్ ఉత్తర్‌ప్రదేశ్ మథురలో సందడి చేసింది.
శ్రీకృష్ణ జన్మస్థానం 'మథుర'లో నటి శోభన, పలువురు నృత్యకారిణులు నది ఒడ్డున సాంస్కృతిక నృత్య ప్రదర్శన చేశారు. నటీమణులు నృత్యంతో స్థానికంగా అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ వీడియోను మూవీటీమ్ 'థీమ్ ఆఫ్ కల్కి' పేరుతో సోమవారం రిలీజ్ చేసింది. ఆధ్యాత్మిక ప్రదేశంలో సినిమాను ఇంత సంప్రదాయ రీతిలో ప్రమోట్ చేయడం బాగుంది అంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. మరి ఈ వీడియోను మీరు చూశారా?
Glimpses from the unveiling of #ThemeOfKalki at Lord Krishna’s birthplace, Mathura 📸✨
— Kalki 2898 AD (@Kalki2898AD) June 24, 2024
- https://t.co/dGJ3oHf0rb
Full Song will be out soon. #Kalki2898AD @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani #Shobana @Music_Santhosh @VyjayanthiFilms… pic.twitter.com/KlDSxiV4Ip
బుకింగ్స్ స్టార్ట్: ఈ సినిమా వరల్డ్‌వైడ్ గ్రాండ్‌గా జూన్ 27న రిలీజ్ కానుంది. విడుదల రోజు ఉదయాన్నే 5.30 గంటలకు ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఈ క్రమంలో ఆదివారం నుంచే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. దీంతో భారీ స్థాయిలో టికెట్లు అమ్ముడవుతున్నాయి. క్షణాల్లోనే టికెట్లు సోల్డ్ ఔట్ అవుతున్నాయి.
కాగా, దర్శకుడు నాగ్అశ్విన్ ఈ సినిమాను మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ జానర్లో హై విజువల్స్ అండ్ విఎఫ్ఎక్స్ ఎఫెక్స్తో తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన రెండు ట్రైలర్లకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రంలో హీరో ప్రభాస్ భైరవ్‌గా కనిపించనున్నారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో కనిపించనున్నారు. సీనియర్ హీరో కమల్ హాసన్ గెస్ట్ రోల్లో పోషిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెతోపాటు మరో స్టార్ హీరోయిన్ దిశా పటానీ కీలక పాత్రలో నటిస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ 'కల్కి'ని నిర్మించారు. సంతోష్ నారాయణ్ సినిమాకు సంగీతం అందించారు. ఇక ఈ సినిమా జూన్ 27న వరల్డ్‌వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
దీపికను ఆటపట్టించిన ప్రభాస్ - ఈ ఫన్నీ వీడియో చూశారా? - Kalki 2898 AD Movie
ఈ వారం థియేటర్లలో ఒక్కటే సినిమా - కానీ OTTలో మాత్రం బోలెడు! - This Week Theatre OTT Releases