ETV Bharat / entertainment

'ఆశ ఆమెతో మొదలవుతుంది' - 'కల్కి' నుంచి పవర్​ఫుల్ పోస్టర్ రిలీజ్ - Kalki 2898 AD - KALKI 2898 AD

Kalki 2898 AD Deepika Padukone : ట్రైలర్ రిలీజ్​ కంటే ముందే 'కల్కి' మేకర్స్ అభిమానులకు ఓ స్వీట్ సర్​ప్రైజ్ ఇచ్చారు. సినిమా నుంచి దీపికా పదుకుణెకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. దాన్ని మీరూ ఓ లుక్కేయండి.​

Kalki 2898 AD
Kalki 2898 AD (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 9, 2024, 1:51 PM IST

Kalki 2898 AD Deepika Padukone: రెబల్ స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన 'కల్కి 2898 AD' సినిమా రిలీజ్​కు కౌంట్​డౌన్ దగ్గరపడుతోంది. సైన్స్​ ఫిక్షన్ జానర్​తో ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తునన్న నాగ్ అశ్విన్, ప్రమోషన్స్​ కూడా అంతే గ్రాండ్​గా చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం (జూన్ 10) సినిమా నుంచి ట్రైలర్ రీలీజ్ చేయనున్నారు. అయితే అంతకంటే ముందే ఆదివారం అభిమానులకు ఈ చిత్ర నిర్మాణ సంస్థ ఓ స్వీట్ సర్​ప్రైజ్ ఇచ్చి ఆకట్టుకుంది.

ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె న్యూ లుక్​ను ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా రిలీజ్ చేసింది. 'ఆశ ఆమెతో మొదలవుతుంది' అంటూ సాలిడ్ క్యాఫ్షన్​ను కూడా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఈ క్యాప్షన్ అర్థం ఏంటి? నాగ్ అశ్విన్ ప్లాన్ ఏంటి? రేపు రిలీజ్ అయ్యే ట్రైలర్​కు ఈ పోస్టర్​కు ఏదైనా సంబంధం ఉందా అని నెటిజన్లు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమా జూన్ 27న వరల్డ్​వైడ్​గా గ్రాండ్​ రిలీజ్ కానుంది. దీంతో ఓవర్సీస్​లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ప్రభాస్​ క్రేజ్​తో ఓవర్సీస్ బుకింగ్స్​ జోరందుకున్నాయి. టికెట్లు హాట్​ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. విదేశాల్లో ఈ చిత్రాన్ని దాదాపు 124 లోకేషన్లలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 116 థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్‌ చేస్తే ఒక్కరోజులోనే 4933 టికెట్స్‌ అమ్ముడయ్యాయి. దీంతో త్వరలోనే థియేటర్ల సంఖ్య కూడా మరింత పెంచనున్నట్లు సమాచారం అందుతోంది.

కాగా, ఈ చిత్రంలో హీరో ప్రభాస్ భైరవ్​గా కనిపించనున్నారు. సినిమా కోసం స్పెషల్​గా డిజైన్ చేసిన బుజ్జి (కారు)ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ స్పెషల్ కారుకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. చెన్నై సహా పెద్ద పెద్ద నగరాల్లో కారును తిప్పుతున్నారు. ఇక దీపికా పదుకొణెతోపాటు మరో స్టార్ హీరోయిన్ దిశా పటానీ కీలక పాత్రలో నటిస్తోంది. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్‌ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో కనిపించనున్నారు. సీనియర్‌ హీరో కమల్‌ హాసన్‌ గెస్ట్ రోల్​లో పోషిస్తున్నారు.

'కల్కి' ట్రైలర్​ రిలీజ్ డేట్ ఫిక్స్​ - ఎప్పుడంటే?

క్లీంకారకు 'కల్కి' స్పెషల్ గిఫ్ట్స్- ​ఏం పంపించారంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.