ETV Bharat / entertainment

'దేవర' సెన్సార్ వర్క్స్ కంప్లీట్- రన్​టైమ్ 3 గంటలు? - Devara Run Time

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2024, 10:13 PM IST

Devara Run Time: పాన్ఇండియా స్టార్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన సినిమా 'దేవర పార్ట్ 1'. ఈ సినిమా సెన్సార్ పనులు తాజాగా పూర్తయ్యాయి.

Devara Run Time
Devara Run Time (Source: ETV Bharat)

Devara Run Time: గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన 'దేవర పార్ట్ 1' సినిమా నుంచి రీసెంట్​గా రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది.​ అంతేకాకుండా యూట్యూబ్​లో ట్రెండింగ్​లో నిలిచి లక్షల వ్యూస్​తో దూసుకుపోతోంది. అయితే సెప్టెంబర్ 27న సినిమా గ్రాండ్​గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్​ ప్రారంభించారు. ఇక తాజాగా సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి.

ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డు యూ/ఏ (U/A) సర్టిఫికెట్‌ జారీ చేసింది. కాగా, సినిమా రన్​టైమ్​ 2 గంటల 57 నిమిషాల 58 సెకన్ల పాటు ఉండనుంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ 'జనతా గ్యారేజ్' తర్వాత ఎన్టీఆర్​తో తీసిన సినిమా కావడం వల్ల దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక మూవీలో విజువల్స్‌ అద్భుతంగా ఉంటాయని, చివరి 40 నిమిషాలు సినిమాలో హైలైట్‌ అని హీరో ఎన్టీఆర్ ముంబయిలో జరిగిన ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ అంచనాలు రెట్టింపు చేశారు.

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సినిమాలో హీరోయిన్​గా నటిస్తోంది. సీనియర్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్​ పాత్ర పోషించారు. ఇక మరాఠీ భామ శృతి మరాఠే కీలప పాత్రలో కనిపించనుంది. నటులు శ్రీకాంత్, గెటప్ శ్రీను తదితరులు ఆయా పాక్రలు పోషించారు. మ్యూజిక్ సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇప్పటికే రిలీజైన మూడు పాటలకు కూడా మంచి క్రేజ్ లభించింది.

Devara Movie USA Pre Sales: ఈ మూవీ రిలీజ్​కంటే ముందే అనేక రికార్డులను సాధించి ఫుల్ ట్రెండింగ్​లో నిలుస్తోంది. ఇటీవలే ఓవర్సీస్‌లో ఈ మూవీ ప్రీసేల్‌ టికెట్‌ బుకింగ్స్​లో వన్‌ మిలియన్‌ సేల్ చేసింది. ఈ క్రమంలో నార్త్‌ అమెరికన్‌ బాక్సాఫీస్‌ వద్ద అత్యంత వేగంగా టికెట్ల ప్రీసేల్‌ ద్వారా వన్‌ మిలియన్‌ మార్క్‌ దాటిన సినిమాగా రికార్డుకెక్కింది. అంతేకాకుండా ట్రైలర్‌ రిలీజ్ కాకముందే ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగానూ రికార్డు నెలకొల్పింది.

'దేవర' బిజినెస్ డీటెయిల్స్ ఇవే​ - భారీ స్థాయిలో టికెట్ ప్రీ సేల్స్​! - NTR Devara Movie

'అండర్​ వాటర్​లో 38 రోజులు షూట్​ చేశాం - ఆ 40 నిమిషాలు డోంట్ మిస్​​' : ఎన్టీఆర్ - Devara Movie

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.